ఈ దసరా పండుగ రోజు ఒక అరుదైన ఖగోళ యోగం ఏర్పడబోతోంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత అక్టోబర్ 2న నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కానీ ముఖ్యంగా మూడు రాశివారికి ఇది వరప్రసాదంలా మారబోతోంది. ఒక్క రాత్రిలోనే జీవితం పూర్తిగా మారిపోయే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జ్యోతిష్యంలో అనేక శక్తివంతమైన యోగాలు ఉన్నప్పటికీ గజకేసరి యోగం, పారిజాత యోగం, త్రిగ్రహ యోగం, నవపంచమ రాజయోగం ప్రత్యేకమైనవిగా పరిగణిస్తారు. అందులోనూ నవపంచమ రాజయోగం ఏర్పడితే ధన, దైర్య, ఐశ్వర్య, విజయాలను ప్రసాదించే శక్తి కలిగినదిగా భావిస్తారు. ఈసారి బుధుడు, గురుడు, శని గ్రహాల అనుకూల స్థితి కారణంగా ఈ అపూర్వ యోగం ఏర్పడనుంది.
పండితుల ప్రకారం ఈ యోగం మీన రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి వారికి రాత్రికి రాత్రే అదృష్టాన్ని తెస్తుంది. ఆ రాశివారికి అకస్మాత్తుగా ఆదాయం పెరగడం, పెట్టుబడులపై భారీ లాభాలు రావడం, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అవకాశాలు దక్కడం ఖాయమని చెబుతున్నారు. ఎక్కడి నుంచో డబ్బు వచ్చి చేరడం, గతంలో ఆగిపోయిన లావాదేవీలు పూర్తవడం, భూముల విషయంలో లాభాలు రావడం జరుగుతుందని చెబుతున్నారు.
కేవలం ఆర్థిక లాభాలే కాదు, ఈ రాశివారికి సమాజంలో పేరుప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగరంగంలో పదోన్నతులు రావడం, కోర్టు కేసుల్లో విజయాలు సాధించడం, పెళ్లిళ్లలో ఎదురైన ఆటంకాలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా క్రమంగా తగ్గుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో ఆస్తులు కూడబెట్టడం, లాటరీల ద్వారా లాభాలు పొందడం, రాదనుకున్న డబ్బులు దొరకడం కూడా సాధ్యమే. ఈ యోగం ఉన్నంత కాలం ఈ మూడు రాశివారు మట్టిని తాకితే అది బంగారమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే ఈ అరుదైన అవకాశం ఈ మూడు రాశివారి అదృష్టాన్ని తలకిందులు చేస్తుందని పండితులు విశ్వసిస్తున్నారు. అందుకే దసరా రోజున ఈ నవపంచమ రాజయోగం ప్రభావాన్ని తెలుసుకొని, ఆ రోజు శుభకార్యాలు, పూజలు చేస్తే ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయని చెబుతున్నారు.
