Chandrababu – YS Sharmila: ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్న షర్మిల: రైతు సమస్యలపై కీలక వినతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా యూరియా కొరత అంశంపై వినతి పత్రాన్ని సమర్పించేందుకు ఆమె ఈ భేటీకి సిద్ధమవుతున్నారు.

‘ఆ సైకోను ఎవరూ గట్టిగా అడగలేదు’: అసెంబ్లీలో జగన్‌పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. చిరంజీవి వ్యవహారంపై ఘాటు చర్చ

తమిళనాడు ఆహ్వానంపై సీఎం రేవంత్ రెడ్డి చెన్నై పయనం

రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించేలా ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా, శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ‘రైతన్నకు అండగా కాంగ్రెస్‌’ కార్యక్రమాన్ని షర్మిల చేపట్టనున్నారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం, అన్నదాతల ఆక్రందనలపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూ సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ముఖ్యమంత్రిని కలిసే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “యూరియా సకాలంలో ఇవ్వడం చేతకాక రోగాల పేరుతో రైతులను నిందించడం సిగ్గుచేటు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “యూరియా అందించలేని కూటమి ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత?” అని ప్రశ్నించారు.

యూరియా ఎక్కువగా వాడుతున్నారని, క్యాన్సర్‌కు కారణం అవుతుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆమె “కుంటి సాకులు, హాస్యాస్పదం” గా కొట్టిపారేశారు. రైతు సంక్షేమమే అజెండా అని చెప్పుకొనే కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో చేతులెత్తేసిందని షర్మిల ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, షర్మిల సీఎంను కలవాలని నిర్ణయించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం నుంచి వచ్చే స్పందనపై రైతులలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Murthy About Jubilee Hills By Election, Who Will Win.? | Telugu Rajyam