స్కూటీపై వెళుతున్న మైనర్లకు క్లాస్, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని పోలీసులకు హోంమంత్రి అనిత ఆదేశం!

Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత విజయనగరం జిల్లా పర్యటనలో రోడ్డుపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చింతలవలస 5వ బెటాలియన్‌ సమీపంలో తన కాన్వాయ్‌లో వెళుతున్న మంత్రి, రోడ్డుపై అతివేగంగా స్కూటీ నడుపుతున్న ఇద్దరు మైనర్లను గమనించారు. వెంటనే అప్రమత్తమై తన సిబ్బందికి చెప్పి కాన్వాయ్‌‌ను ఆపించారు.

స్కూటర్‌పై వెళుతున్న ఇద్దరు పిల్లలను ఆపి, వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి గట్టిగా క్లాస్ పీకారు. అక్కడితో ఆగకుండా, వెంటనే ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని అక్కడి పోలీసులను మంత్రి అనిత ఆదేశించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హోంమంత్రి అనిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా మోటార్ యాక్ట్ ప్రకారం మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తారు. ఇటీవల విజయవాడలో ఓ మైనర్ స్కూటీతో ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో, మైనర్‌కు వాహనం ఇచ్చినందుకు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు పద్ధతి మార్చుకోవడం లేదని మంత్రి అనిత అన్నారు.

శ్రీలంకలో నిర్బంధంలో ఉన్న కాకినాడ జాలర్లు విడుదల: స్వదేశానికి తిరుగు పయనం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: కూటమి ప్రభుత్వం శుభవార్త

విజయనగరంలో వెలసిన శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవానికి హాజరు కావాలని హోంమంత్రి అనితకు ఆహ్వానం అందింది. శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమీషనర్ శిరీష విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. అక్టోబర్ 7వ తేదీన జరిగే సిరిమాను ఉత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న ఈ జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అలాగే, రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల తగ్గింపుపై మంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ట్రూ అప్ అంటూ ఏకంగా 11 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, ఎక్కడైనా ధరల పెరుగుదలే చూశామని అన్నారు. అయితే, కూటమి ప్రభుత్వంలో తొలిసారి కరెంటు చార్జీలు తగ్గడం చూస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Dasari Vignan on Vijay Thalapathy Rally | Strong Counter or Support? | Telugu Rajyam