Donald Trump: ’86 47’… అమెరికాలో మళ్లీ ట్రంప్ హత్యకు కుట్ర?

ఒక్క పోస్టుతో అమెరికా రాజకీయాలు ఉలిక్కిపడ్డాయి. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ’86 47′ అనే రెండు సంఖ్యల సంకేతం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై హత్య కుట్రకు సంకేతమా? అనే అనుమానాలు అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

న్యూమెరాలజీ కోణంలో చూస్తే ‘47వ అధ్యక్షుడు’ అంటే ట్రంప్‌కు సంకేతమవుతుందని, ‘86’ అనేది హత్యకు సంకేతంగా పాశ్చాత్య సంస్కృతిలో అర్థం కానివ్వడం వల్లే మూడవ దృక్కోణం లోకం అసహజంగా స్పందించింది. ఈ ఘటనపై స్పందించిన జేమ్స్ కామీ… తాను బీచ్‌లో కనిపించిన గవ్వల (షెల్స్) ఫొటోను షేర్ చేశానని, నంబర్లకు తనకు వేరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చినప్పటికీ, మూడుసార్లు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాల నేపథ్యంలో ఇది సరదాగా చూసే విషయం కాదని అంతర్గత భద్రతా శాఖ చెబుతోంది.

ఇప్పటికే ఈ కోడ్‌పై సీక్రెట్ సర్వీస్, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు విచారణ మొదలుపెట్టాయి. గత ఏడాది ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఆయన భద్రత చుట్టూ గట్టి ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. గోల్ఫ్ ఆడుతుండగా ఆయన్ని లక్ష్యంగా చేసుకున్న మరో వ్యక్తిని కాల్చి చంపిన ఘటన మరువదగినది కాదు. తాజాగా జేమ్స్ కామీ పోస్టుతో మరోసారి ట్రంప్‌ సెక్యూరిటీపై కేంద్రబిందువు ఏర్పడింది.