వైసిపి ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి
భూ కుంభకోణం గురించి మాట్లాడుతూ…”తొందర్లోనే ఆశ్చర్యకరమైన విషయాలు బైటకు రాబోతున్నాయని…దేశంలోనే యోధానుయోధులు,పెద్దలుగా చెలామణి అవుతున్నవారు ఈ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నారు”…వైసిపి ప్రభుత్వం చట్టప్రకారం వాటినన్నింటిని ఆధారాలతో సహా బైటపెట్టబోతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి అభిమానులు స్పందిస్తూ….అదే జరిగితే తాము “ఎన్నాళ్లో వేచిన ఉదయం” అదేనని సంబరపడుతున్నారు.
అంబటి రాంబాబు ఏమన్నారంటే?…
అమరావతి భూ కుంభ కోణం దేశంలోనే అతిపెద్ది. ఎక్కడా ఇటువంటిది జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఇది జరిగింది. తాము ప్రతిపక్షంలో ఉండగా అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశాం…ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడినాక అవి ఆరోపణలేనా…వాస్తవాలా?…అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఎసిబి విచారణ జరిపిస్తున్నాం. అక్కడ బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. చట్టాలను, బౌండరీలను మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. దానిపై ఆధారాలు దొరికాయని ఎసిబి చెప్పినట్లు అంబటి రాంబాబు తెలిపారు.
ఇంకా ఏమన్నారంటే…
అమరావతి స్కామ్‌పై సీబీఐ విచారణ వెయ్యమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది…టిడిపి వాళ్లు తప్పు చెయ్యకపోతే సీబీఐ వెయ్యమని కేంద్రాన్ని కోరమనండి…వాళ్లు తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు సీబీఐ విచారణ కోరడం లేదు…ఫైబర్ గ్రిడ్ పేరుతో లోకేష్ బినామీలకు టెండర్లు ఇచ్చి 2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. 24 గంటల్లో వాళ్లు సీబీఐ విచారణ కోరకపోతే తప్పు చేసినట్టే. ఈ రెండు అంశాల మీద బీజేపీ కూడా సీబీఐ విచారణ కోరాలి…అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
అందుకేనా?
పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలులో వైసిపి నేతలు అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వారంతా జైలుకు వెళ్లక తప్పదని నారా లోకేష్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే వైసిపి అమరావతి భూ కుంభకోణం విచారణ వేగవంతం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు కుంభకోణానికి పాల్పడినట్లు తాము ప్రతిపక్షంలో వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాన్ని ఇంతవరకూ నిరూపించలేకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పెద్దలతో సమావేశాల సందర్భంగా వైసిపి నేతలు ఎన్నాళ్లుగానో అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పుండు మీద కారం జల్లినట్లు లోకేష్ రివర్స్ లో వైసిపి నేతల మీద అవినీతి ఆరోపణలు చేయడంతో ఇక పార్టీ ముఖ్యుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారట. ఫలితంగానే ఈ పరిణామలని వైసిపి శ్రేణులు అంటున్నాయి.
వైసిపి అభిమానుల్లో ఉత్కంఠ
అమరావతి భూ స్కామ్ లో చంద్రబాబు, ఫైబర్ నెట్ స్కామ్ లో లోకేష్ బుక్ అవ్వడం ఖాయమని…అప్పుడు ప్రజలు వారి నిజస్వరూపాన్ని ఆధారాలతో సహా తెలుసుకోవడం ఖాయమని…అప్పుడు ఎవరు అసలైన దొంగలో తెలిసివస్తుందని వైసిపి అభిమానులు అంటున్నారు. రాజధాని అమరావతిలో అక్రమాల నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు పార్లమెంట్‌లో పట్టుపట్టాలని వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో వైఎస్ జగన్ ను ఎన్నో రకాలుగా అవమానించిన చంద్రబాబు,లోకేష్, టిడిపి నేతలకు తగిన శాస్తి జగరగాలని, అసలైన అవినీతిపరులు వాళ్లే అనేది ప్రజలందరూ తెలుసుకోవాలని…ఆ రోజు కోసమే తాము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని వైసిపి అభిమానులు తమ ఆంకాక్ష వ్యక్తం చేస్తున్నారు.