చంద్రబాబు అధికారంలో లేకుంటే… అంబటి కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం చంద్రబాబు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని… ఈసారి గెలుపు తలుపులు తీయకపోతే ఇక రాజకీయంగా టీడీపీ సమాధి ఖాయమని బలంగా నమ్ముతున్నారని అంటుంటారు. అందులో భాగంగానే పవన్ కల్యాణ్ ని బ్రతిమాలడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. పవన్ వెంట వద్దన్నా కూడా పడుతున్నారని అంటుంటారు.

ఈ సమయంలో చంద్రబాబు పరిస్థితిపై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తాను తప్ప మరొకరు అధ్హికారంలో ఉంటే అస్సలు ఓర్చుకోలేరని… ఆయన పదవి కోసం రాష్ట్రం ఏమైపోయినా, ఎవరేమైనా ఆయనకు సంబంధం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో అంబటి తాజా కామెంట్లు ఆసక్తిగా మారాయి.

అవును… చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేకపోతే రాష్ట్రమంతా హింస చెలరేగాలని కోరుకుంటారని.. అది ఆయన నైజమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో కలిసి మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు… తాజాగా వినుకొండలో జరిగిన ఘటన విషయాలు వివరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన అంబటి… పత్రికలు ఏమిరాసినా, మీడియా ఏమి చూపించినా… స్థానికులకు వాస్తవాలేంటో స్పష్టంగా తెలుసు అని అన్నారు. ఆ సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపకపోయి ఉంటే అక్కడ ఘటన మరింత ఘోరంగా ఉండేదనే విషయం తనకంటే ఎక్కువగా స్థానికులకే తెలిసని అన్నారు.

“ఇటీవల బ్రహ్మనాయుడు వల్లభ డెయిరీ పెట్టారు.. ఈ ఫాం నిర్మాణం కోసం గోతులు తవ్వి, మట్టి బయటకు తీశారు.. దీన్ని ఆసరాగా చేసుకుని వేరే చోట నుంచి మట్టిని తరలిస్తున్నారంటూ… జీవీ ఆంజనేయులు, టీడీపీ నేతలు యాగీ చేశారు.. గోడలు దూకి బ్రహ్మనాయుడు స్థలంలోకి వెళ్లి ఫొటోలు తీసి సెల్ఫీ చాలెంజ్‌ చేశారు..” అని అంబటి అసలు ఆ ఘటనకు గల ప్రాధమిక కారణాన్ని చెప్పారు.

అనంతరం… ఈ పరిస్థితిని గమనించిన వాచ్‌ మెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దానికి ధర్నా, ఊరేగింపు చేస్తూ ఈ గొడవకు ఆజ్యం పోశారు.. బ్రహ్మనాయుడు జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే… చుట్టూ మూగి కారుకు టీడీపీ జెండా కట్టారు. గన్‌ మెన్లకు దెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఫ్రస్ట్రేషన్‌ తో జీవీ అంజనేయులు ఈ దాడులు చేయించారు” అని సవివరంగా వివరించారు అంబటి రాంబాబు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై స్పందించిన అంబటి… 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ కు పట్టిన చంద్రబాబు అనే శనిని వైఎస్‌ రాజశేఖరరెడ్డి వదిలించారని.. మరలా 2019లో వైఎస్‌ జగన్‌ ఇంటికి పంపారని అన్నారు. ఇదే సమయంలో… బాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏపీలో 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కరువు మండలం కూడా లేదని వివరించారు.