కొత్త వైర‌స్: ఎక్కువ టైం తీసుకోదు.. 24 గంటల్లోనే మరణం!

ఇటీవల కాలంలో కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా దాటికి ఇప్పటికీ కోలుకోని ప్రజలు, కుటుంబాలు, వ్యవస్థలూ, దేశాలూ ఎన్నో ఉన్నాయి. ఆ స్థాయిలో కరోనా అల్లకల్లోలం చేసింది. ఆ దెబ్బనుంచే ఇంకా పూర్తిగా కోలుకోకుండా ఉంటే… మరో కొత్త వైరస్ ఒకటి రంగంలోకి దిగిందంట. ప్రస్తుతానికి ఇంకా నామకరణం చేసుకోని ఈ వైరస్… పెద్ద ఎక్కువ సమయం తీసుకోదంట. సోకిన 24గంటల్లోనే ముక్కు నుండి రక్తం రావడంతో మరణం సంభవించేస్తుందంట. అంటే… నామకరణం కూడా జరగకుండా నాశనం చేయడం స్టార్ట్ చేసేసిందన్నమాట!

అవును… కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతుంటే.. ఈ లోపే మ‌రో కొత్త వైర‌స్ ద‌డ పుట్టిస్తోంది. ఆఫ్రికా దేశం బురుండిలో కొత్త వైర‌స్ క‌ల‌కలం సృష్టిస్తోంది. బ‌జిరో ప్రాంతంలో ఈ వైర‌స్ సోకిన 24 గంటల్లోనే ముగ్గురు వ్యక్తులు ముక్కు నుండి రక్తస్రావంతో మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. వైర‌స్ సోకిన వారిలో జ్వరం, త‌ల‌నొప్పి, వాంతులు, నీర‌సం లక్షణాలు క‌నిపించిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఇది వైర‌స్ బ‌గ్ గా క‌నిపిస్తోంద‌ని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రకటించిన తరువాత పశ్చిమ ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియాలో ఈ అంటువ్యాధికి సంబంధించిన మరో ఎనిమిది కేసులను ధృవీకరించారు.

ఈ నెల ప్రారంభంలో టాంజానియాలో మార్ బ‌ర్గ్ వైర‌స్ వ్యాప్తి చెందింద‌ని.. ఈ విషయంలో మిగిలిన దేశాలు అప్రమత్తంగా ఉండాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా గ‌తంలో ఆఫ్రికాలో “ఎబోలా వైరస్‌” సృష్టించిన మారణహోమం సంగతి తెలిసిందే. వేలాది మంది ప్రాణాలను బలితీసుకున్న “ఎబోలా” వైరస్ అంటే ఇప్పటికీ కొన్ని దేశాలు వణికిపోతుంటాయి. ఇప్పుడు దాదాపు అలాంటి లక్షణాలతోనే కొత్త వైరస్ ఉండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.