ప్రతివారమూ కొత్తపలుకు లో ఏదో ఒక అంశాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మీద, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సూర్యుడిపై ఉమ్మేసినట్లుగా ఉమ్మేయడం మన ఏబీన్ రాధాకృష్ణ కు చికిత్సలేని మాయరోగంగా సంక్రమించింది. ఆ ఇద్దరూ తిరుగులేని ప్రజాభిమానంతో మధ్యందిన మార్తాండులులా వెలిగిపోతుండటం, మరో సారి కూడా వారిదే అధికారం అని ఇప్పటినుంచే ప్రజలలో ఒక అభిప్రాయం స్థిరపడిపోవడంతో పాటు, తనకు అవినీతిసొమ్మును దోచిపెట్టే యజమాని చంద్రబాబు కళావిహీనుడుగా మిగిలిపోవడం, ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని ప్రజలు చెప్పుకోవడం, తెలంగాణాలో తెలుగుదేశం ఉనికినే కోల్పోయి వెయ్యి అడుగులో గోతిలో పాతిపెట్టబడటం, లోకేష్ నాయుడు మీద ఎలాంటి ఆశలు లేకపోవడం… ఏబీన్ రాధాకృష్ణ ను దాదాపు పిచ్చివాడిగా చేస్తున్నాయి. అందుకే కవ్వించకపోయినా అరిచే గ్రామసింహం లాగా ప్రజలందరూ నవ్వుకునేట్లు అరుస్తుండటం ఆయనకో ఆనవాయితీగా మారిపోయింది. ఈ వారం “హలొ వింటున్నారు” అంటూ ప్రపంచంలో ఎవరికీ తెలియని పరమరహస్యాలను వాంతి చేసుకున్నాడు!
***
ఇంతకు ఫోన్ ట్యాపింగ్ పై నీ అభిప్రాయం ఏంటి రాధాకృష్ణ?
“రానురాను ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది కదా! అన్న భావన అందరిలోనూ ఏర్పడింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తులపై కూడా నిఘా నీడ విస్తరించడం కొంత సంచలనానికి కారణమైంది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదులు.. ”ప్రభుత్వానికి ఏ పాపం తెలియదు. కావాలంటే విచారణ జరిపించుకోండి” అని బల్లగుద్ది మరీ వాదించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి విచారణ జరిగినా సాక్ష్యాలు లభించవన్న ధీమాతో వారు అలా వాదించి ఉండవచ్చు.”
అంటే…ఏ ప్రభుత్వమైనా ఫోన్ టాపింగులు చెయ్యడం రివాజే అని రాధాకృష్ణ నిర్వేదమా? అలా అయితే ఇప్పుడు రాధాకృష్ణ కొత్తగా ఏడవడం దేనికి? ఓహో…రాధాకృష్ణ ఏడుపంతా న్యాయమూర్తుల ఫోన్ల మీద నిఘా పెట్టారనా? పెట్టారని ఎవరు చెప్పారు ఆయనకు? న్యాయమూర్తులు చెప్పారా? లేక విచారణలో ఋజువైందా? ఆధారాలు లేని, రుజువు కానీ ఆరోపణలు పదేపదే చెయ్యడం అంటే గోబెల్స్ ప్రచారం కాదా? ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతున్నపుడు మళ్ళీ ఆరోపణలు చెయ్యడం కోర్ట్ ధిక్కారం కాదా? విచారణ జరిపించుకోండి అని ప్రభుత్వ న్యాయవాదులు వాదించడం నేరమా? టాపింగ్ కు సాక్ష్యాలు లభించవు అని రాధాకృష్ణకు ఎలా తెలిసింది? ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారని సాక్ష్యాలు దొరకబట్టె కదా ఆయన రాజీనామా చేసింది? ఫోన్ టాపింగ్ జరిగిందని చెప్పేది రాధాకృష్ణే. దానికి ఆధారాలు దొరకవని చెప్పేది కూడా రాధాకృష్ణే. మరి పోలీసులకు కూడా దొరకని ఆధారాలు రాధాకృష్ణకు ఎలా దొరికాయి? ఏ ఆధారాలతో ఆయన తన వంటకాన్ని తయారు చేశారు? రాధాకృష్ణను బోనెక్కించి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదా లేదా?
***
“తెలంగాణ ప్రభుత్వం అయితే ఏకకాలంలో కొన్ని వందల ఫోన్ల సంభాషణలను వినగలదు అని చెబుతున్నారు. దీంతో అధికార, విపక్షాలు అన్న తేడా లేకుండా ప్రముఖులు అనబడే వారందరూ దొంగ చెవులకు చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు”
భేష్…భేష్…తెలంగాణ ప్రభుత్వం ఇతరుల ఫోన్ సంభాషణలను వినగలదని ఎవరు చెబుతున్నారు? మరి జగన్ మీద రాసినట్లే కేసీఆర్ మీద కూడా ఒక కథనాన్ని రచించి ప్రచురించవచ్చు కదా? ఆమ్మో…కేసీఆర్ కన్నెర్ర జేస్తే రాధాకృష్ణ ప్యాంటు తడిసి ముద్దవుతుంది! తన యజమాని పారిపోయినట్లు తట్టాబుట్టా సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోవాల్సి వస్తుంది. అదీ భయం!
***
న్యాయశాఖా మంత్రిని న్యాయమూర్తులు కలిస్తే ఏమవుతుంది?
“ఇందిరాగాంధీ హయాంలో పి.శివశంకర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తులు కొందరు తమ వాహనాలను దూరంగా పార్క్ చేసి, సందుల్లో నడుచుకుంటూ వెళ్లి ఆయనను కలుసుకునే వారు. కేంద్ర మంత్రిని తాము కలిసిన విషయం ప్రతిపక్షాలకు తెలియకూడదన్న ఉద్దేశంతో వారలా చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి”
రాధాకృష్ణ నోటికన్నా డ్రైనేజీ ఉత్తమమైనదేమో! శివశంకర్ న్యాయశాఖామంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను న్యాయమూర్తులు కలవడంలో దోషం ఏముందో రాధాకృష్ణకు మాత్రమే తెలుసు. న్యాయమూర్తులు రహస్యంగా కలిసేవారు అని చెప్పడం ద్వారా రాధాకృష్ణ న్యాయమూర్తుల పట్ల ఎలాంటి గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు? న్యాయమూర్తులేమైనా దొంగలా? కేంద్రమంత్రిని న్యాయమూర్తులు కలిసిన సంగతి ప్రతిపక్షాలకు తెలిస్తే ఏమవుతుంది? ఓకే…అదీ నేరమని ఒప్పుకుందాము. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పున్నమిఘాట్ లో అర్ధరాత్రి రహస్యంగా ఎందుకు విందులు ఇచ్చారు? పందొమ్మిది మంది న్యాయమూర్తులు చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరయ్యారట. ఆ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బయటకు పంపించి చంద్రబాబు ఒక్కరే న్యాయమూర్తులకు పదార్ధాలు కొసరి కొసరి వడ్డించారట! అంతకన్నా ఘోరంగా న్యాయమూర్తులు తమ మంత్రిని కలిస్తే?
****
“చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక భారీ ఆపరేషన్‌లో పలువురు నక్సలైట్ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత, అప్పుడు హోం మంత్రిగా ఉన్న నాయకుడు విరసం నేత వరవరరావుకు ఫోన్ చేసి జరిగిన దానితో తనకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ సంభాషణను రికార్డు చేసిన సంబంధిత అధికారులు ముఖ్యమంత్రిని కలిసి వినిపించారు. అప్పటి నుంచి నక్సలైట్లకు సంబంధించిన ఆపరేషన్ల విషయంలో పోలీసు అధికారులు ముఖ్యమంత్రి అనుమతి మాత్రమే తీసుకునేవారు. హోం మంత్రులకు అటువంటి విషయాలు తెలియనిచ్చేవారు కారు. “
ఓహోహో…చంద్రబాబు నిజస్వరూపాన్ని రాధాకృష్ణ ఎంత నిస్సిగ్గుగా బయటపెట్టారో! అంటే తన హోమ్ మంత్రి, ఇతర మంత్రుల ఫోన్ల మీద కూడా చంద్రబాబు ఆ రోజుల్లో నిఘా పెట్టారన్న మాట! పైగా అప్పటి హోమ్ మంత్రి విప్లవ కవి వరవరరావుకు ఫోన్ చేసి సంజాయిషీ ఇచ్చారట…ఆ సంభాషణను అధికారులు రికార్డ్ చేశారట! సాక్షాత్తూ హోమ్ మంత్రి టెలిఫోన్ సంభాషణలనే రికార్డు చేయించి ఆ తరువాత హోమ్ మంత్రికి కూడా తెలియకుండా కార్యకలాపాలు నిర్వహించిన ఘనుడు అన్నమాట చంద్రబాబు! మరి ఆనాడు అధికారులు హోమ్ మంత్రికి కూడా తెలియకుండా నేరుగా ముఖ్యమంత్రికే విషయాలు తెలియజేస్తే ఆది చంద్రబాబు పాలనాదక్షత! అదే పని జగన్ చేస్తే ఆది పెద్ద నేరం! వహ్వా…ఏమి రాధాకృష్ణా నీ స్వామిభక్తి! ఛీ..ఛీ అనాలనిపిస్తుంది నాకు!
***
“ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్ లిస్ట్‌లో ఉన్నవారితో మాట్లాడటానికి సైతం అధికారులు ఇష్టపడటం లేదు. ”నేను మీతో మాట్లాడతాననే విషయం ముఖ్యమంత్రికి తెలిస్తే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. దయచేసి ఇకపై నాతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు” అని ఆ మధ్య ఒక పోలీసు అధికారి నా వద్ద వాపోయారు”
సో…ఫ్రెండ్స్….ఇపుడు తేలిన విషయం ఏమిటంటే…రాధాకృష్ణ రోజూ పోలీసులకు ఫోన్లు చేస్తూ కేసీఆర్ కు వ్యతిరేకంగా తనకేదైనా సమాచారం ఇవ్వాలని కోరేవాడు…ఆ విషయం ముఖ్యమంత్రికి తెలిసింది. కాబట్టి అప్పటినుంచి అధికారులు రాధాకృష్ణతో మాట్లాడాలంటే భయపడుతున్నారు! ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన పోలీసు అధికారులు రాధాకృష్ణతో మాట్లాడుతున్నారన్న మాట! వింటున్నారా పోలీసు అధికారులూ? ప్రభుత్వానికి ద్రోహం చేస్తే ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటారా? ముఖ్యమంత్రి విశ్వాసం పోయిన తరువాత మీకు శంకరగిరిమాన్యాలు తప్పవు అని మీకు తెలియదా?
***
కెసిఆర్ పై రాధాకృష్ణ కోపం దేనికి ?
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చిక్కుకున్న ఈ కేసు గురించి అప్పట్లో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఏకే ఖాన్‌కు తెలియదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో ఆయనకు నమ్మకమైన మరో అధికారి మొత్తం ట్యాపింగ్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ విషయంలో మరో ఆకు ఎక్కువే చదివారు”
హద్దీ….కేసీఆర్ పై రాధాకృష్ణకు గల కోపం అంతా ఇప్పుడు బయటపడింది! తన యజమాని చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ససాక్ష్యంగా పట్టుకుని, పదేళ్ళపాటు హైద్రాబాద్ లో ఉండాల్సిన అవకాశాన్ని కోల్పోయి కట్టుబట్టలతో రాత్రికి రాత్రే అమరావతికి పారిపోవడానికి కారణభూతుడయ్యాడన్న కసి కేసీఆర్ మీద పీకలదాకా ఉన్నది రాధాకృష్ణకు. చంద్రబాబు కంటే నాలుగాకులు ఎక్కువే చదివిన కేసీఆర్ ముందు చంద్రబాబు జిత్తులు పనిచేయలేదు. ఆ విషయం నాటి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ కు కూడా తెలియదని ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఎవ్వరికీ తెలియని ఆ రహస్యం ఒక్క రాధాకృష్ణకు మాత్రమే ఎలా తెలిసింది? చంద్రబాబుది నలభై ఏళ్ల అనుభవం అని, ఆయన చాణక్యుడని, చక్రాలు తిప్పాడని ఇన్నాళ్లుగా విర్రవీగుతూ చంద్రబాబు భజనలతో మునిగితేలుతున్న రాధాకృష్ణకు…చంద్రబాబు కన్నా, జగన్ మరో ఆకు ఎక్కువే చదివాడని ఇన్నాళ్లకు జ్ఞానోదయం కలిగింది! హహహహహా…
***
“ఇటీవలి కాలంలో తనను కలిసిన ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలతో ”మీరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టచ్‌లో ఉంటారట కదా!” అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రశ్నించారట. దీంతో ప్రభుత్వం మా పైన కూడా నిఘా పెట్టిందా? ఏమిటి? అని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై నిఘా వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ”ముఖ్యమంత్రికి న్యాయవ్యవస్థపై ఎటువంటి అభిప్రాయం ఉందో మాకు తెలుసు, అందుకే న్యాయమూర్తులపై నిఘా పెట్టే ఉంటారని నమ్ముతున్నాం” అని మరో అధికారి వ్యాఖ్యానించారు.”
ఇటీవలే కొన్ని భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు రానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి వాతావరణాన్ని చెడగొట్టడానికి పారిశ్రామికవేత్తల సంభాషణలు కూడా ప్రభుత్వం వింటున్నది అంటూ గాలి పోగేసి ఆరోపణలు చెయ్యడానికి బరితెగించారు రాధాకృష్ణ. పారిశ్రామికవేత్తల సంభాషణలు వినాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? “ఇక న్యాయమూర్తుల మీద నిఘా పెట్టారని నమ్ముతున్నాం” అంటూ మరో దుర్గంధ వాయువు! అదేమిటో తమాషా…ఆంధ్రా, తెలంగాణలోని అత్యున్నత అధికారులు అందరూ రాధాకృష్ణకు ఫోన్లు చేసి తమ బాధలను పంచుకుంటారు! నవ్వు ఆపుకుంటున్నారా? అక్కర్లేదు…మనసారా నవ్వుకోండి…
“అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం సర్వసాధారణం అయింది కనుక సజ్జల చేసిన ఆరోపణను కొట్టిపారేయలేము. కాకపోతే, న్యాయవ్యవస్థపై నిఘా పెట్టడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. చెయ్యాల్సిందంతా చేసి, తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని వాపోవడమే విడ్డూరంగా ఉంది”
ఒక అబద్ధాన్ని పదేపదే నిజమని ప్రచారం చేస్తే ఆది కొన్నాళ్ళకు నిజమే అని జనం నమ్ముతారు అనే సూక్తి రాధాకృష్ణకు చాలా ఇష్టమైనది. అందుకే ఒకే వ్యాసంలో నాలుగైదు చోట్ల న్యాయవ్యవస్థపై నిఘా పెట్టారు అని రాధాకృష్ణ వదరుతుంటాడు…
*****
“తనపై కేసులను విచారిస్తున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ డేటానే అక్రమ మార్గంలో సంపాదించిన జగన్ అండ్ కోకు తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకం పెరగకుండా ఉంటుందా? దర్యాప్తు అధికారి కాల్ డేటానే అక్రమంగా సంపాదించిన వారిపై ఇంతవరకూ చర్యలు లేవు.”
హయ్యాయో…లక్ష్మీనారాయణ కాల్ డేటానీ అక్రమ మార్గంలో సంపాదించారు! ఏమి బయటపడ్డాయి ఆయన సంభాషణల్లో? తన చెలికత్తెతో జగన్ మీద చేస్తున్న దర్యాప్తు వివరాలను పంచుకోవడమే కదా? రోజుకు పదిసార్లు ఆమెకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం లక్ష్మీనారాయణకు ఏముంది? అసలు ఏ దర్యాప్తు అధికారి అయినా, దర్యాప్తు విషయాలను కట్టుకున్న భార్యతోనే పంచుకోవడం జరగదు! మరి అలాంటి రహస్యాలను ఒక చెలికత్తెతో, రాధాకృష్ణతో ఆయన ఎలా పంచుకున్నాడు? అందుకే తేలు కుట్టిన దొంగలా గమ్మున ఉండిపోయాడు లక్ష్మీనారాయణ! మరి ఎంతోమంది చంద్రబాబు ప్రత్యర్థుల మీద అక్రమంగా కేసులు పెట్టించి వేధించిన లక్ష్మీనారాయణ తన కాల్ డాటాను సంపాదించినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? కారణం తెలియదా? ఆయన చేసింది మొత్తం పనికిమాలిన దొంగ దర్యాప్తే అని అందరికీ తెలుసు కదా?
****
జీవీఎల్ పై అసహనం దేనికి రాధాకృష్ణ ?
“అధికార వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా జీవీఎల్ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. జీవీఎల్ వంటి వారి వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడిపోతోందని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఎవరడిగారని జీవీఎల్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారో తెలియడం లేదని ఆయన వాపోయారు. “
హహహహా…నాకు పొట్ట ఉబ్బిపోతున్నది మిత్రులారా నవ్వీనవ్వీ…ఒరిజినల్ బీజేపీ నాయకుడు జీవీఎల్ వలన రాష్ట్రంలో బీజేపీ బలపడటంలేదని బీజేపీ నాయకులు బాధపడిపోతున్నారట! ఎందుకంటే ఆయన పాపం బాపడు! నలభై ఏళ్ళనుంచి ఎన్టీఆర్, చంద్రబాబుల కోసం సొంత పార్టీని భూస్థాపితం చేసిన వెంకయ్యనాయుడు వలన బీజేపీ ఆంధ్రాలో ఆకాశం ఎత్తుకు ఎదిగింది! అవును మరి! ఎందుకంటే ఆయన “మనవాడు” . మొన్నటిదాకా చంద్రబాబు కోవర్టులా పనిచేసి బీజేపీని సర్వనాశనం చేసిన కన్నా లక్ష్మీనారాయణ వలన పార్టీకి ఇసుమంత కూడా నష్టం జరగలేదు మరి! బ్రాహ్మణులు అంటే చంద్రబాబు, రాధాకృష్ణకు చచ్చేంత కసి…ద్వేషం! ఈ విధంగా బయటపెట్టుకుంటారు వాళ్ళు.
****
“బీజేపీ పెద్దల మనుసులో ఏముందో తెలియదు గానీ, వారు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ వంటి వారిని ముందుగా అదుపు చేయాలి. మా పార్టీ మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం!”
అవును…రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్, లక్ష్మీపతి రాజా, రఘురాం లాంటి చంద్రబాబు మనుషులను అందరినీ పార్టీ నుంచి తన్ని తరిమేసి, తక్షణమే వెంకయ్య నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి, లంకా దినకర్ ను ఉపాధ్యక్షుడిగా చేసి, సుజనాచౌదరి, రమేష్ లాంటివారిని ప్రధాన కార్యదర్శులుగా నియమించాలి. అప్పుడే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ సింహాసనం దక్కుతుంది!