ఆయనో యంగ్‌స్టర్.. నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాల్ని నిర్మించారు కూడా. కాకపోతే, యాటిట్యూడ్ విషయంలో మనోడి గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.
తాజాగా ‘అవతార్-2’ సినిమా వచ్చింది. ఆ సినిమా తనకు నచ్చలేదంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడాయన. దానికి ఆయన ‘బాకా’ ఊదే కొందరు మీడియా ప్రతినిథులు.. ఆహా.. హోహో.. అన్నారు కూడా. అది కూడా ‘పెయిడ్’ వ్యవహారమేనట.!
అయితే, ఓ సినిమాని దెబ్బతీసేలా ఓ సినిమా నిర్మాతే వ్యవహరించడమేంటి.? అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని మనం మురిసిపోతున్నాం. అలాంటిది, మనం హాలీవుడ్ సినిమాని కించపర్చేలా మాట్లాడటమేంటి.? అనంటూ కొందరు సీనియర్ నిర్మాతలు, సదరు యువ నిర్మాతకి తలంటు పోశారట.
‘అయినా, నువ్వేం సినిమాలు తీశావ్.? హీరోయిన్ బొడ్డు, తొడల మీదనే కదా సినిమాలు తీసింది..’ అంటూ ఓ సీనియర్ నిర్మాత ఏకి పారేశాడట ఆ యంగ్ ప్రొడ్యూసర్‌ని. ఎవరా ప్రొడ్యూసర్.? ఏమాకథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.