కొత్త డైలమా… చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి ఎందుకంటే?

2019 ఎన్నికల్లో టీడీపీకి అధికార గండం పొంచి ఉందా? ఏపీ రాజకీయాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయాల్లో రాణించేది ఇక కలగానే మిగలనుందా? తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే ఇప్పుడు ఆ పార్టీని ఆదుకునేది ఎవరు? అన్ని పార్టీలు స్టార్ డమ్‌తో ముందుకు పోతుంటే…. మరీ తెలుగుదేశాన్ని ఆదుకునే ఆ స్టార్‌డమ్ ఎవరు? ఇప్పుడు అందరిలోనూ అదే చర్చ జరుగుతుంది…ఇంతకీ టీడీపీకి ముఖ్యమయ్యే ఆ స్టార్ ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి…

భారతదేశ చరిత్రలో తెలుగు రాజకీయాలలో ఒక ప్రభంజనం సృష్టించిన నేత దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు. సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. ఆయన నటనతో తెలుగు అభిమానులనే కాకుండా ప్రపంచం అంతా అభిమానులను సాధించుకున్న గొప్ప నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలను చూడలేక తానే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల జీవితాలను బాగుచేయాలని భావించి తెలుగు ప్రజల పార్టీగా 1982 మార్చి 29న తెలుగుదేశం స్థాపించారు. ఆ తర్వాత రాష్ట్రమంతా పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తాను కృషి చేస్తాను నన్ను ఆశీర్వదించడంటూ ముందుకు వెళ్లారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా, చైతన్య రథం యాత్రలతో ఎన్టీఆర్ ముందుకు సాగారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం సాధించి రాజకీయ చరిత్రలో ప్రభంజనం సృష్టించారు ఎన్టీఆర్. కొత్తకొత్త పథకాలతో ప్రజలలోకి వెళ్లారు. తెలుగు జాతికి తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. సంపూర్ణ మద్యపాన నిషేదం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత ఎన్టీఆర్‌దే. దేశంలో ప్రతిపక్షాలన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు రాజకీయాలలో పెనుమార్పులు జరిగాయి. మంత్రిగా ఉన్న చంద్రబాబు తిరుగుబాటు చేయడంతో ఆయన అచేతనుడు అయ్యాడు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 1996 జనవరి 18 న గుండెపోటుతో 73 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ మరణించారు. ఆ తర్వాత చంద్రబాబు పూర్తి బాధ్యతలు తీసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ హవాను తట్టుకోలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, తదితర రాజకీయ అంశాలతో చంద్రబాబు కాస్త ఇబ్బందిపడ్డాడు. చంద్రబాబు పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యాడు. రెండు రాష్ట్రాలు విడిపోయాక 2014లో ఏపీ ప్రజలు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. తెలంగాణలో మాత్రం కొన్ని స్థానాలు గెలిచినా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్ లో చేరిపోయారు. దీంతో చిన్న చిన్న గా టీడీపీలో బలమైన నేతలంతా జారిపోవటంతో తెలంగాణలో టీడీపీ కి అడ్రస్ గల్లతైంది. ఇక ఏపీలో బలంగా ఉన్న టీడీపీకి వైసీపీ నుంచి చాలా బలమైన పోటీనే ఉంది. ఇప్పటికే జగన్ పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు దగ్గరవుతున్నాడు. పవన్ ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి ఇప్పటికే తన కార్యాచరణను అమలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నాడు. ఈ సమయంలో చంద్రబాబుకు ఇద్దరు బలమైన నేతల నుంచి చాలా గట్టి పోటీనే తగులుతుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ రాజకీయాలలో రాణించడం కాస్త అనుమానమే అని కొంత మంది టీడీపీ నాయకులే అంటున్నారు. దీంతో చంద్రబాబునాయుడే పెద్ద దిక్కై పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితిలో టీడీపీకొ మరో బలమైన నాయకుడి అవసరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో మాస్, క్లాస్ ఇమేజ్ ఉన్న నాయకుడి అవసరం కావాలని టీడీపీ భావిస్తుంది.

ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఆ మహానుభావుడి హావాభావాలను కలిగి ఉన్న స్టార్‌డమ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సహాకారం తప్పనిసరి అని కొందరు నేతలు భావిస్తున్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ సహకారం తప్పని సరని, ఆయనతో ఇప్పటి నుంచే టచ్‌లో ఉండాలని నేతలు చంద్రబాబుకు సూచించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో ప్రాబల్యం కోల్పోయిన టీడీపీకి, ఏపీలో అటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశ్యంతో దీనికి బాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీకి జూ.ఎన్టీఆర్ ఓ బలమైన ఆయుధంగా మారనున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాక నిజమా కాదా అనే చర్చ ప్రస్తుతం పార్టీలోనూ, అభిమానుల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రావడం లోకేష్ కి ఇష్టం లేదని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ వస్తే అటెన్షన్ లోకేష్ మీది నుంచి ఎన్టీఆర్ మీదికి మల్లుతుంది. ఎన్టీఆర్‌కి ఫాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. లోకేష్‌ను సీఎం చేయాలనుకున్నప్పుడు లోకేష్ తప్ప మరో ఫీగర్ పార్టీలో కనిపించ రాదు. అందువల్ల ఎన్టీఆర్‌ని ఆహ్వానించాలా వద్దా అనే డైలమాలో బాబు ఉన్నాడని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఆనాటి ఎన్టీఆర్ స్టార్ డమ్, ఈ నాటి ఎన్టీఆర్ కి సాధ్యమవుతుందేమో వేచి చూడాలి మరీ….