టీడీపీ జాతీయ కమిటీతో పాటు పొలిట్ బ్యూరో ఏర్పాటు అయింది. అవకాశాలు దక్కని వారికి ఫోన్ చేసి మరీ సర్ది చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే భూమా, జేసీ ఫ్యామిలీలకు ఈకార్యవర్గంలో చోటు కల్పించని చంద్రబాబు వీరి మాత్రం ఫోన్ చేయలేదు. కనీసం రాజకీయ భవిష్యత్తుపై భరోసా కూడా ఇవ్వలేదు. ఇకపై ఈ రెండు కుటుంబాల సేవలను ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని భావిస్తున్నారంటా టీడీపీ అధినేత.
అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ, కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీలు రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉన్నా… వీరి కారణంగా లేని పోని వివాదాలు వస్తుండడంతో కామ్ గా పని చేసుకుపోయే వారికే ఈసారి ప్రయారిటీ ఇచ్చారంటా చంద్రబాబు. సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకు అవకాశం దక్కలేదని ఈ రెండు కుటుంబాలు తమ తమ అనుచరులకు చెప్పుకుంటున్నా… చంద్రబాబు లెక్కలు వేరే ఉన్నాయంటా. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అయిందానికి కానిదానికి రాద్దాంతం చేయడం తప్ప… వీళ్ల వల్ల నిజంగా పార్టీకి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదని చంద్రబాబు భావిస్తున్నారంటా. ఎంతసేపు కేసులు, గొడవలే కాని ప్రజాసమస్యలపై కార్యకర్తలను ప్రత్సహించే విధంగా వీళ్లు పనిచేయడం లేదంటా. ఎంత సేపు తమ ధ్యాసే కాని పార్టీ మీద వీళ్లకు శ్రద్ధ లేదని ఆయన భావిస్తున్నారంటా.
మాజీ ఎమ్మెల్యే అనితను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమించడమే కాకుండా ఏకంగా పొలిట్ బ్యూరోలోకి కూడా తీసుకున్నారు. రాజకీయాల్లో చురుగ్గా లేని గల్లా అరుణను సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చేశారు. కాని యాక్టివ్ గా ఉన్నా భూమా అఖిలప్రియను పక్కన పెట్టారు.
పలు కేసుల్లో జైలుకు వెళ్లిన కొల్లు రవీంద్రకు పదవులు వచ్చినా.. జేసీకి రాకపోవడానికి ఇదే కారణమంటా. పైగా ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి పై జగన్ సర్కారు కేసు పెట్టినప్పుడు లోకేష్ పత్రికా ప్రకటనలకే పరిమితం కాకుండా, జేసీ బ్రదర్స్ ని వ్యక్తిగతంగా పరామర్శించారంటా. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలని అప్పుడే చంద్రబాబు లోకేష్ కు సర్ది చెప్పినట్లు సమాచారం. అదండీ సంగతి. అడిగే వారు లేరు కదా అని రెచ్చిపోయి ప్రవర్తిస్తుంటే ఇదిగో ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.