శనీశ్వరునికి పూజ చేస్తున్నారా… తప్పనిసరిగా మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

సాధారణంగా ఎంతో మంది భక్తులు శనీశ్వరుడి పేరు వినగానే భయపడతారు. శనీశ్వరుడిని పూజించడం వల్ల ఆయన ప్రభావం మనపై ఉంటే అష్ట కష్టాలు అనుభవించాలని సంకోచం వ్యక్తం చేస్తుంటారు.నిజానికి శనీశ్వరుని దృష్టి అందరిపై ఉంటుంది ఎవరైతే వక్రబుద్ధితో ఉంటారో అలాంటి వారిపై ఆయన చెడు ప్రభావం ఉంటుంది. అలాగే శని మనం చేసే పనులను బట్టి మనకు ప్రతిఫలం అందజేస్తూ ఉంటారు. ఇకపోతే శనీశ్వరుడిని పెద్ద ఎత్తున కొందరు భక్తులు పూజిస్తూ శని ప్రభావం శని దోషం తొలగిపోవాలని భావిస్తారు.

ఈ విధంగా శనీశ్వరునికి కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు. అయితే శనీశ్వరుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళలు శనీశ్వరుడిని పూజించే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.శనీశ్వరుడిని పూజ చేసే సమయంలో మహిళలు ఎప్పుడూ కూడా శని విగ్రహాన్ని తాకి పూజ చేయకూడదు. ఇలా చేయడం వల్ల శని వక్రదృష్టి మనపై పడుతుంది. అదేవిధంగా మహిళలు శనీశ్వరునికి పూజ చేసే సమయంలో స్వామివారికి నూనె సమర్పిస్తూ పూజ చేయకూడదు.

ఇక శని దోషం తొలగిపోవాలని పూజ చేసేవారు రావి చెట్టు కింద నువ్వుల నూనె దీపం వెలిగించి పూజ చేయడం మంచిది. అదేవిధంగా శనివారం శనీశ్వరుని ఆలయంలో శని చాలీసా చదవడం మంచిది . అలాగే పేదవారికి శనివారం నల్లటి నువ్వులు నల్లటి దుప్పటి లేదా వస్త్రాలు,ఇనుప సామాగ్రిని దానం చేయటం వల్ల శని ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు.అయితే శని దేవుడిని పూజించే మహిళలు ఎప్పుడూ కూడా స్వామివారిని తాకి పూజించకూడదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.