Astro Tips: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తే.. జీవితం సంకనాకి పోతుందంట..?

మన జీవితం ఎలా సాగుతుంది అనేది, ఉదయం ఎలా మొదలవుతుందోపై చాలా భాగం ఆధారపడి ఉంటుంది. శాస్త్రం, పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఉదయం శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంపద నిలిచిపోవాలంటే రోజు ప్రారంభం పవిత్రమైన పద్ధతిలో ప్రారంభం కావాలి. దీనికోసం హిందూ సాంప్రదాయాలు కొన్ని అద్భుతమైన నియమాలు సూచిస్తున్నాయి.. ఇవి కేవలం మతపరంగా కాకుండా, ఆధ్యాత్మికంగా, జీవన విధానంగా కూడా చక్కగా పనిచేస్తాయి.

ఉదయం నిద్రలేచి మన చేతులు చూసి ఓ శ్లోకాన్ని జపించడం ఒక గొప్ప ఆచారం.
శ్లో.. “కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతీ.. కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనం ||”

అని పఠించాలి. ఈ శ్లోకంలో చేతుల్లోనే లక్ష్మీ, సరస్వతి, గోవిందుడి నివాసం ఉంటారని చెబుతోంది.. దీని ద్వారా మన చేతులే మన భాగ్యాన్ని అందిస్తాయని చెబుతోంది. ఉదయం లేచిన వెంటనే ఈ శ్లోకం జపించడం వలన.. వల్ల మనలోని ఆశయాలు పవిత్రత పొందుతాయి, కర్మ శుద్ధి జరుగుతుంది. దీనితో పాటు, స్నానం చేసిన వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కరించాలి. తులసి పర్వదినాల్లో పూజించదగినది మాత్రమే కాదు, ప్రతి రోజూ తులసికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మన ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. శుభశక్తులు వాస్తవంగా ఆకర్షితమవుతాయి.

దీనితో పాటు సూర్యారాధన. సూర్యుడు జీవికి జీవనదాత. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనకు శక్తి, ఉత్సాహం, స్పష్టత లభిస్తాయి. ఈ ప్రక్రియ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇక ఇంట్లో మహిళలు బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుఝామున లేచి ప్రార్థన చేయడం అత్యంత శుభప్రదం. ఇది ఒక్క ఆధ్యాత్మికత కోసమే కాదు, ఇంట్లో శాంతిని నిలబెట్టే మార్గంగా కూడా చెప్పవచ్చు. ఇక ఇంట్లో పడక.. తూర్పు లేదా దక్షిణ దిశకు మలచడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది, ఆయుష్యు పెరుగుతుంది.

శాస్త్రప్రకారం సాయంత్రం భోజనం చేయకపోవడం మంచిదని చెబుతారు. రాత్రి ఆహారం తీసుకోవడం వల్ల శరీరాన్ని ప్రభావితం చేసే నెగటివ్ ప్రభావాలు ఏర్పడతాయని విశ్వాసం ఉంది. ఈ నియమాలు మానవ జీవితాన్ని క్రమబద్ధంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దే సాధనాలే. ఇవి మన సంస్కృతికి మాత్రమే పరిమితమయ్యాకుండా, జీవన గమనాన్ని శుభదాయకంగా మార్చే మార్గదర్శకాలు కూడా.