లక్ష్మీదేవి.. సకల సంపదలకు అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయంటారు మన పెద్దలు. అయితే ఆ తల్లి చంచల స్వభావి అంటారు. అమ్మవారి అష్టోతరంలో చంచలాయేనమః అనే నామం కూడా ఉంది.దీనికి కారణం తెలుసుకుందాం… ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది.
దాని అనుసారంగా లక్షణాలు కనబడుతాయి, శ్రీలక్ష్మీ ఉపాసన చేసినచో, ధనప్రాప్తి అవుతుంది. ఈ ఉపాసన తగ్గినచో, అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకున్ని వదలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుష్యులు లక్ష్మీ చంచలమైనదని అంటుంటారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమింటే, లక్ష్మీ చంచలమై వున్నట్లయితే తను శ్రీవిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వుండేది. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత, భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు అని పెద్దల అభిప్రాయం.