సనాతన ధర్మంలో అనేక ఆచారాలు ఉన్నాయి. దేవుడు.. పూజ, నైవేద్యం, ధర్మం, దానం ఇలా అనేక పద్ధతులు. అయితే ఈసారి మనం దేవతలు, దేవుళ్లకు ఏ నైవేద్యం పెడితే ఏం ఫలితమో తెలుసుకుందాం…
కొబ్బరికాయ పనులు సులభంగా కావడానికి. అనుకున్న రీతిలోనే పనులు నెరవేరడానికి, కార్యాలయాలలో పైఅధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఈ నైవేద్యం మంచిది.
కమలా పండ్లు చాలాకాలంగా నిలిచిపోయిన పనులు నెరవేరుతాయి. నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి సహాయపడుతారు. అన్నింటా విజయం.
మామిడి పండు బకాయిలు వసూలు, ఇక గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి. బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది. గణపతిహోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి. ఇష్ట దైవానికి తేనే, మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది.
చిన్న అరటి పెండిగ్ ఉన్న పనులు ముందుకు సాగుతాయి. త్వరగా పనులు పూర్తవుతాయి. కార్యసిద్ధి.
సపోటా పండు వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే చికాకులు తొలగిపోతాయి. సంబంధాలు ఖాయమవుతాయి. వివాహం కానివారికి శ్రీఘ్రంగా వివాహం.
అరటిగుజ్జు పెండ్లి తదితర శుభ కార్యాలయాలకు సకాలంలో నగదు అందుతుంది. నగదు మంజూరవుతుంది. అప్పులు తీరుతాయి. నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి.
నేరేడుపండు భోజనంతోపాటు నేరేడు పండును వడ్డిస్తే అన్నపానీయాలకు లోటు ఉండదు. నేరేడు పండును నైవేద్యంగా ఇస్తే నీరసం, నిరుత్సాహం పోతాయి. శనీశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను, నడుం, మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి. విష్ణువు, శివుడికి ఈ పండ్ల నైవేద్యం శుభఫలితాలను ఇస్తుంది.
ద్రాక్షపండ్లు దానం చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి. దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆనందం, సంతోషం కలిగిస్తుంది.
జామపండు గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి. దేవీ నైవేద్యంగా ఉంచితే చక్కెర వ్యాధుల నుంచి ఉపశమనం. సంతాన ప్రాప్తి, దాంపత్య కలహాలు తొలగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గణపతికి పంచామృత అభిషేకం చేసి జామపండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది.
ఇలా ఆయా రకాల పండ్లను భక్తితో శ్రద్ధతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. వాటిని నైవేద్యంగా సమర్పించి తప్పక వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. పదిమందికి పంచాలి.