విఘ్నాలు తొలగించే ఆ విగ్నేశ్వరుడిని ప్రథమ దేవుడిగా భావిస్తారు. దేవతలందరూ కూడా విగ్నేశ్వరుడిని పూజిస్తున్నరంటే ఆయన మహిమ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏ శుభకార్యం జరిగినా, పూజా కార్యక్రమాలు జరిగినా కూడా మొదట వినాయకుడికి పూజ చేస్తారు. గణపతి పూజ పూర్తయిన తర్వాతే మిగిలిన పూజ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంతటి మహిమ గల వినాయకుడు అన్ని ప్రాంతాలలోనూ కొలవై ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. వినాయకుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలులో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటి.
క్రీస్తు శ 840 సంవత్సరంలో చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ గణపతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సుదూర ప్రదేశాల నుండి భక్తులు తరలివచ్చి వినాయకుడిని దర్శించుకుని తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న విగ్నేశ్వరుడి చెవిలో భక్తులు తమ కోరికలు చెప్పి నెరవేర్చమని వేడుకుంటారు. అంతేకాకుండా ఈ ఆలయంలో విగ్నేశ్వరుడితోపాటు నందీశ్వరుడు, భూలింగేశ్వరుడు కూడా కొలువై ఉండటం ఇక్కడ విశిష్టత. అంతేకాకుండా ఈ ఆలయంలో వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు.
ఈ ఆలయానికి వెళ్లిన భక్తులు తమ మనసులో ఉన్న కోరికలను గణపతి చెవిలో చెబితే కోరికలు నెరవేరుతాయి అని ప్రజల నమ్మకం. ఇక ప్రతి ఏడాది ఈ ఆలయంలో గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో గణపతికి హోమం చేయించడం వల్ల ఆ కుటుంబానికి ఉన్న సమస్యలు తొలగిపోయి జీవితాంతం గణపతి ఆ కుటుంబానికి అండగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించి భక్తులు తమ కోరికలు నెరవేరటం కోసం గణపతిని వేడుకోవచ్చు.