శని దృష్టి మీపై పడకుండా ఉండాలంటే బుధవారం నాడు వినాయకుడికి ఈ విధంగా పూజ చేస్తే సరి..?

మన హిందూ పురాణాల ప్రకారం వారంలో ఏడు రోజులపాటు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఉన్న ఏడు రోజులు ఒక్కరోజు ఒక్క దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. బుధవారం వినాయకుడికి ప్రత్యేకమైన రోజు. అందువల్ల బుధవారం రోజున వినాయకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రథమ దేవుడైన విగ్నేశ్వరున్ని పూజించటం వల్ల మనం చేసే ప్రతి పనిలోనూ విజయం భరిస్తుంది. మనం ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాతనే మన పనులు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ఏదైనా శుభకార్యాలు పూజలు వ్రతాలు అంటే వాటిని నిర్వహించే సమయంలో కూడా మొదటగా వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలను ప్రారంభించాలి .

ఇలా వినాయకుడికి ఇష్టమైన బుధవారం రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దృష్టి మనపై పడకుండా కాపాడుతాడని ప్రజల విశ్వాసం. బుధవారం రోజు వినాయకునికి శమీ మొక్కను సమర్పించి పూజించటం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజ చేసే సమయంలో వినాయకుడికి ఇష్టమైన ఎరుపు రంగు సింధూరం తిలకం రాసి పూజించటం వల్ల వినిగ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే పూజలో అన్నం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల వినాయకుడి పూజలో అన్నం తో చేసిన ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలి.

అంతే కాకుండా బుధవారం రోజు వినాయకుడికి నెయ్యి బెల్లం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడు సంతోషపడతాడు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే బుధవారం రోజు గణపతికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ముఖ్యంగా గణపతిని గరిక తో పూజించటం వల్ల శనీశ్వరుని దృష్టి మనపై పడకుండా విఘ్నేశ్వరుడు రక్షిస్తాడు. అలాగే బుదవారం రోజున అన్నం దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.