సాధారణంగా రాత్రి వేల మనం నిద్రించేటప్పుడు కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నసార్లు మంచి కలలు వస్తె మరికొన్నిసార్లు పీడకలలు వస్తుంటాయి. ఇలా కొన్ని సందర్భాలలో కలలో దేవుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం ఎలా ఒక్కో విధమైన కలకు ఒక్కొక్క అర్థం ఉంటుంది.చాలా సందర్భాలలో మనం ఆ సంఘటన ఎక్కడో చూసినట్లు గా గుర్తుకు వస్తుంది. రాత్రి వేళ నిద్రించిన సమయంలో కలలో వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇలా కలలో వినాయకుడు కనిపించడం వల్ల మంచిదా? లేదా? అని ప్రజలు అనుమానంతో ఉంటారు. సాధారణంగా కొన్నిసార్లు కలలు కనిపించిన సంఘటనలు మన భవిష్యత్తులో జరుగుతూ ఉంటాయి. ఇలా కలలో వినాయకుడు కనిపించడం మంచిదా? లేదా? అన్న విషయం గురించి తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని కలలో చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. కలలో వినాయకుడు కనిపించడం వల్ల భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని దాని అర్థం. అంతేకాకుండా ఇలా కలలో వినాయకులు కనిపించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయని ముందుగా మనకు సూచన ఇస్తున్నట్లు అర్థం. ఇలా కలలో వినాయకుడితోపాటు శివుడు, పార్వతి, కార్తికేయుడు కనిపించినా కూడా అది శుభప్రదంగా భావించవచ్చు. ఇలా ఈ దేవతలందరూ తనలో కనిపించడం వల్ల జీవితంలో మనకి ఉన్న కష్టాల నుండి తొందర్లోనే విముక్తి కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అయితే కలలో ఇలా వినాయకుడు కనిపించిన విషయాన్ని మనం బయట పెట్టకూడదు.
కొన్ని సందర్భాలలో వినాయకుడు స్వారీ చేస్తున్నట్లు కల వస్తే.. మీరు ఏదైనా మతపరమైన లేదా మరేదైనా యాత్రకు వెళ్లవచ్చని అర్థం. అలాగే ఈ ప్రయాణం మీకు శుభదాయకంగా ఉంటుంది. ఒకవేళ కలలో గణేష్ ని పూజిస్తున్నట్లు వస్తే మనం చేపట్టబోయే పనులలో విజయం లభిస్తుందని.. అలాగే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. ఇలా కలలో వినాయకుడు కనిపించడం వల్ల ఆటంకాల వల్ల ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని అర్థం. ఒకవేళ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నట్లు కల వస్తే అది అశుభ్రంగా భావించవచ్చు. ఇలా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నట్లు కల రావడం వల్ల మన జీవితంలో సమస్యలు మొదలవుతాయి.