ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.. పండగ విశిష్టత ఏమిటో తెలుసా?

మన హిందూ సంప్రదాయంలో పండుగల కు చాలా విశిష్టత ఉంది. ప్రతి పండుగను ప్రజలందరూ ఎంతో ఆనందంగా భక్తుశ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఉగాది పండుగను వివిధ రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ ఉగాది. ఎంతో ఘనంగా జరుపుకునే ఈ ఉగాది పండుగను ఈ ఏడాది ఎప్పుడు జరుపుకుంటారు తెలుసుకుందాం.

2023వ సంవత్సరంలో ఉగాది పండుగను మార్చి 22వ తేదీన జరుపుకోవాలి. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి (Chaitra masam)రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఉగాది అంటే అర్థం ఉగా అంటే నక్షత్ర గమనం అది అంటే మొదలు అని అర్థం వస్తుంది.అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజును ఉగాది అంటారు.తెలుగు ప్రజలు ఉగాది రోజున కొత్త సంవత్సరం గా మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.

భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి రోజు అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని.. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రభావ నామా ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడవ బ్రహ్మ, బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఈ రోజున శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించాడని ప్రజల విశ్వాసం.అందువల్ల సృష్టి మొదలైన ఈ రోజున ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.