దీపికా- రణవీర్ నూతన గృహ ప్రవేశం… ఆ ఇంటి ఖరీదు తెలిస్తే షాక్…?

బాలీవుడ్ లవ్లీ కపుల్ దీపికా పదుకునే- రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలాకాలం రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ 2018లో పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. అప్పటినుండి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా దీపిక వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. రణవీర్ సింగ్ కూడా బ్యాక్ తో బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన ఈ జంట ఇటీవల ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసింది.

తాజాగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించి రణవీర్ దీపిక దంపతులు గృహప్రవేశం చేశారు. దీపిక రణబీర్ దంపతులు తీసుకున్న నూతన ఇంటి ఖరీదు దాదాపు 22 కోట్లు ఉన్నట్లు సమాచారం. ముంబై సముద్ర తీరంలో అలీబాగ్ లో ఉన్న ఈ ఇల్లు 2.5 ఎకరాలలో విస్తరించి సకల సదుపాయాలతో విలాసవంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా దీపిక రణవీర్ దంపతులు ప్రస్తుతం ముంబై‌లోని ప్రభాదేవి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొత్త ఇంటిని వీరు గెస్ట్ హౌజ్ గా ఉపయోగించుకోవాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ దంపతులిద్దరూ సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ దంపతులు వారి సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాల విషయానికి వస్థే.. ఈ దంపతులిద్దరూ 83 సినిమాలో జంటగా నటించారు. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి జంటగా నటించిన మొదట సినిమా ఇది. ప్రస్తుతం దీపికా ఫైటర్, పఠాన్ వంటి బాలీవుడ్ సినిమాలలో పాటు ప్రాజెక్ట్ కె వంటి పాన్ ఇండియా సినిమాలో కూడ
ప్రభాస్ సరసన నటిస్తోంది.