Sneha Reddy: భర్త క్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న స్నేహారెడ్డి..41 రోజులపాటు అలా చేయనున్నారా?

Sneha Reddy: సాధారణంగా ఏ అమ్మాయి అయినా తన భర్త క్షేమంగా ఉండాలని తన భర్త ఏ పని చేసిన విజయం సాధించాలని కోరుకుంటుంది అలా కోరుకునే వారిలో స్నేహ రెడ్డి కూడా ఒకరు చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగా పెరిగినప్పటికీ కూడా ఈమె కొన్ని ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను ఎంతగానో పాటిస్తూ ఉంటారు. ఇక ఏదైనా పూజలు వ్రతాలు వంటివి స్నేహ రెడ్డి ఎంతో చక్కగా చేస్తూ ఉండటం మనం చూస్తుంటాము.

ఇక స్నేహ రెడ్డికి దైవభక్తి కూడా ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. తన భర్త పిల్లలు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈమె తరచూ తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ వస్తారు. ఇక తన భర్త సినిమా విడుదలవుతున్న ఆయన ఏదైనా సమస్యలో చిక్కుకున్న వెంటనే తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్ పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నంద్యాల ఘటన నుంచి మొదలుకొని నిన్నటి అరెస్టు వరకు ప్రతి ఒక్క విషయంలోనూ అల్లు అర్జున్ పేరు బయట మారుమోగుతోంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఎంతగానో కృంగిపోయిన స్నేహారెడ్డి తన భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. తన భర్త కోసం 41 రోజుల పాటు ఈమె శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలను చదువుతూ ప్రత్యేకంగా స్వామివారికి పూజా కార్యక్రమాలను చేయబోతున్నారట ఈ 41 రోజులపాటు ఈమె ఒక పూట ఉపవాసం ఉంటూ ఈ పూజా కార్యక్రమాలను చేయబోతున్నట్టు తెలుస్తుంది తన భర్త ఈ వివాదాల నుంచి బయటపడటం కోసమే ఆ స్నేహ రెడ్డి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఈయనకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది అయితే మద్యం తన పేరు రద్దు చేయాలని పోలీసులు కోర్టుకు వెళ్లడంతో ఈయన బెయిల్ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయంపై అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.