హిందువుల సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యం అనిర్వచనీయమైనది. ఈ మాసం ప్రారంభమైనప్పుడల్లా ప్రతి ఇంటిలో భక్తి వాతావరణం నెలకొంటుంది. పూజలు, దీపారాధనలతో ప్రతి ఉదయం పవిత్రమవుతుంది. శివుడు, కేశవుడు ఇద్దరికీ ఇష్టమైన ఈ నెలను పుణ్య మాసంగా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఈ కాలంలో ఆచరించే ప్రతి నియమం, ప్రతి స్నానం, ప్రతి ఉపవాసం భక్తునికి ఆధ్యాత్మిక శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది.
సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం స్నానం అత్యంత పవిత్రమైన ఆచారం. సూర్యోదయం కంటే ముందే చల్లని నీటితో స్నానం చేయడం ఆ మాసంలో అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. పురాణాలలో కూడా దీనిని విశేషంగా పేర్కొన్నారు.. “కార్తీకే మాసి యః స్నానం, కరోతి భక్తిసంయుతః, పాపాన్నివర్తతే నూనం” అని వచనం చెబుతుంది. నది, సరస్సు లేదా కాలువల్లో స్నానం చేయడం శ్రేష్టం అని అంటారు. కానీ నదీ స్నానం సాధ్యంకాకపోతే ఇంట్లోనే తలస్నానం చేసినా ఫలితం తగ్గదని పండితులు చెబుతున్నారు. స్నానానికి ముందు నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి ఆకులు కలిపితే, అది గంగాస్నాన ఫలాన్నే ఇస్తుంది.
కార్తీక స్నానం శరీరానికి, మనసుకు రెండు విధాల ప్రయోజనకరమని ఆయుర్వేదం చెబుతోంది. చల్లని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ వేగవంతమవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీరానికి ఉత్తేజం వస్తుంది. అలా స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవేత్తలూ, వైద్యశాస్త్రమూ ఏకబిగిన చెబుతున్నాయి.
కార్తీక మాసం ఉపవాసాలకు ప్రసిద్ధి. నెలంతా ఉపవాసం చేయడం సాధ్యంకాకపోయినా కనీసం కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, కార్తీక పౌర్ణమి రోజుల్లో అయినా ఉపవాసం చేయడం అత్యంత పుణ్యప్రదమని గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో భోజనం చేయకుండా పాలు, పండ్లతో గడిపితే శరీరం శుద్ధి అవుతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది. ఉపవాస దినంలో మధ్యాహ్నం నిద్రపోవడం పూర్తిగా నిషిద్ధం. సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత శివకేశవులను దర్శించి, ఆకాశంలోని నక్షత్రాలను చూసి భోజనం చేయడం ఉపవాసం విరమించే సరైన పద్ధతి. ఆ నక్షత్ర దర్శనం ద్వారా ఉపవాసానికి పూర్తి ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది.
కార్తీక మాసంలో దీపారాధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రతి ఇంటి ముందు, దేవాలయంలో లేదా నీటిమీద తేలియాడే దీపాలు వెలిగించడం కేవలం ఆచారం కాదు అది భక్తి యొక్క ప్రతీక. “దీపం వెలిగిస్తే ఆత్మలో అంధకారం తొలగిపోతుంది” అనే భావనతో ప్రతి భక్తుడు ఈ మాసంలో దీపారాధన చేస్తాడు. కార్తీక మాసం అనేది కేవలం ఆధ్యాత్మిక శుభఫలాలు ఇచ్చే కాలం మాత్రమే కాదు, అది శరీరానికి, మనసుకు పునరుత్తేజం ఇచ్చే కాలం కూడా. చల్లని వాతావరణం, పవిత్ర స్నానాలు, ఉపవాసం, దీపారాధన ఇవన్నీ కలిపి భక్తుని జీవితంలో శాంతి, అదృష్టం, ఆరోగ్యం ప్రసాదిస్తాయి.
కార్తీక మాసంలో స్నానం చేసిన వాడు గంగాస్నాన ఫలం పొందుతాడు, దీపం వెలిగించిన వాడు లక్ష పుణ్యాలు సంపాదిస్తాడు. అందుకే ఈ పవిత్ర మాసంలో భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, దీపాలు వెలిగించి, హరినామ స్మరణలో మునిగిపోతారు. కార్తీక మాసం అనేది భక్తికి, నియమానికి, పవిత్రతకు ప్రతీక. ఈ నెలలో ఒక దీపం వెలిగించినా, ఒక ఉపవాసం చేసినా.. అది జీవితాన్ని వెలుగులతో నింపుతుంది.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అత్యధికంగా భారతదేశంలోనే ఈ డయాబెటిస్ వ్యాధితో ఎక్కువమంది ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి డయాబెటిస్ పెద్ద సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ మధుమేహ వ్యాధికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక దీర్ఘకాలిక వ్యాధి. శరీరంలో ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోవడం లేదా శరీరం ఇన్సులిన్ ను తగినంత ఉపయోగించకపోవడం దీనికి కారణం. డయాబెటిస్ లో ప్రధానంగా టైప్ 1 మరియు టైప్ 2 ఉంటాయని వరంగల్ నగరానికి చెందిన జనరల్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్ డాక్టర్ సలీం తెలిపారు. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడాలను ఆయన వివరించారు.
టైప్ 1 డయాబెటిస్ అనేది చిన్న వయసు వారిలో వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది 30 ఏళ్లకు పైబడిన వారిలో వస్తుంది. శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ అనే అవయవం బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ టైప్ 1 డయాబెటిస్ లో బీటా సెల్స్ అనేవి డ్యామేజీ అవ్వడం వల్ల శరీరంలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వకపోవడంతో ఈ టైప్ 1 డయాబెటిస్ అనేది వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ లో శరీరం ఇన్సులిన్ ను తగినంత ఉపయోగించకపోవడం లేదా తగినంత ఉత్పత్తి చేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారిలో ఇన్సులిన్ అనేది లేకపోవడం వల్ల శరీరంలోకి ఇన్సులిన్ ను ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారు. వీరిలో టాబ్లెట్స్ వినియోగించిన ఎలాంటి ఫలితం ఉండదు. కేవలం ఇన్సులిన్ వినియోగిస్తేనే డయాబెటిస్ అనేది అదుపులో ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు టాబ్లెట్స్ ను వినియోగిస్తారు. వీటిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ టాబ్లెట్స్ అనేవి శరీరంలోని ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ శాతాన్ని పెంచేందుకు దోహదపడతాయి. అలా కొన్ని రోజుల తర్వాత శరీరంలో ఇన్సులిన్ శాతం పూర్తిగా తగ్గిపోయినప్పుడు వీరు కూడా ఇన్సులిన్ ఇంజక్షన్లను ఉపయోగించవలసి ఉంటుంది.
పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ రెండు రకాల డయాబెటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. జంక్ ఫుడ్స్, మైదా పదార్థాలు, కూల్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ అనేది వస్తుంది. జన్యుపరమైన కారణాల వల్ల టైప్ 1 డయాబెటిస్ అనేది వస్తుంది. ప్రజలు వీటి బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ ను నివారించాలి. ప్రతిరోజు శరీరానికి తగినంత వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
