కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే.. ఈ పనులు చేస్తే అంతా శుభమే?

తెలుగు 12 మాసాలలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎంతో పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని పరిగణిస్తూ ఉంటారు.ఇలా పవిత్రమైన ఈ కార్తీకమాసంలో శివకేశవలను పూజించడం వల్ల ఆ శివ కేశవుల అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. అందుకే పెద్ద ఎత్తున భక్తులు కార్తీక మాసంలో శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇకపోతే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయటం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు కూడా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు మర్చిపోకుండా చేయాల్సిన పనులు ఏంటి అనే విషయానికి వస్తే…

కార్తీక పౌర్ణమి వ్రతాన్ని నవంబర్ 8వ తేదీ జరుపుకుంటారు. ఈరోజు కనుక నదీ స్నానమాచరించి దీపదానం చేయడం వల్ల ఎంతో శుభ పరిణామాలు కలుగుతాయని భావిస్తారు. ఈ క్రమంలోనే కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం ఎంతో మంచిది. పురాణాల ప్రకారం విష్ణువు మస్యావతారంలో నీటిలో కొలువై ఉంటారని భావిస్తారు. ఇలా నది స్నానం చేయటం వల్ల శ్రీహరి అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక కార్తీక పౌర్ణమి రోజు శివకేశవలను ఆరాధించి అలాగే తులసి పూజ చేయాలి ఇకపోతే నేడు సత్యనారాయణ స్వామి వారి కథ వినడం ఎంతో మంచిది.

పవిత్రమైన కార్తీక మాసం రోజున దీప దానం చేయడం ఎంతో మంచిది అందుకే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దీపాలను వెలిగించి నది,చెరువులలో నీటిని వదలడం మంచిది అయితే ఇలా చెరువులలో దీపాలను వెలిగించి వదిలే సమయంలో ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ వదలడం ఎంతో మంచిది.కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః’ఈ శ్లోకం చదువుతూ కార్తిక పౌర్ణమి నాడు దీపం వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది.ఇలా కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేయటం వల్ల అకాల మరణం తొలగిపోయి మన ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని భావిస్తారు.