ఖర మాసంలో ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు.. మళ్లీ శుభ ముహూర్తాలు ఎప్పుడు?

మన హిందూ సంస్కృతిలో ఆచార సాంప్రదాయాలకు చాలా విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. మార్చి 15 వ తేదీ ఉదయం 5:17 గంటలకు ఖర మాసం స్టార్ట్ అయింది.ఖర మాసం మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14 వరకు ఉంటుంది. ఈ మాసంలో సూర్యుడు మీన రాశిలో ఈ కర మాసంలో అన్ని రాశుల వారు  జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర మాసంలో సూర్యుడు మీనం  రాశిలో ఉన్నప్పుడు.. శుభ రాశుల మీద, యోగం మీద, శుభ కార్యాలపై అశుభ ప్రభావం పడుతుంది. అందువల్ల పూజలు, పెళ్లి గృహప్రవేశాలు అంటే శుభకార్యాలు ఈ మాసంలో చేయకూడదు.

 

కర మాసంలో ఏ విధమైన శుభకార్యం తలపెట్టినా కూడా ఆ శుభం జరుగుతుంది.  నూతన వస్తువులు కొనుగోలు చేయడం వ్యాపారాలు ప్రారంభించడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గృహ ప్రవేశం, ఉపనయనం, ముండనం, నిశ్చితార్థం వంటి కార్యాలు కూడా చేయకూడదు. కానీ ఈ మాసంలో భగవంతుని పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది.ఈ మాసంలో  సూర్యున్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

 

ఈ ఖర మాసంలో ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం. అలాగే  కుంకుడు, పసుపు పువ్వులు, అక్షతలను కూడా సూర్య భగవానుడికి సమర్పించి ప్రార్థించాలి.  అలాగే ఈ ఖర మాసంలో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు  కలుగుతాయి. అలాగే ఖర మాసంలో తులసిని పూజించడం వల్ల ఐశ్వర్యం, ధన ధాన్యాలు , ఆరోగ్యం లభిస్తాయి. ఏవైనా శుభకార్యాలు తల పెట్టాలనుకునేవారు కర మాసం మోగిసిన తర్వాత శుభకార్యాలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా శుభకార్యం చేయాలంటే త్రిబలం ఉండాలి. త్రిబలం అంటే.. సూర్యుడు, చంద్రుడు మరియు బృహస్పతి యొక్క శక్తి. ఎప్పుడైతే మూడు గ్రహాలు ఉత్తమ స్థానంలో ఉంటాయో.. అప్పుడే శుభ కార్యాలు చేయటం మంచిది. వీటిలో ఏదైనా ఒకటి బలహీనంగా ఉన్నా శుభకార్యం చేయకూడదు.29 వరకు బృహస్పతి అస్తమిస్తుంది. బృహస్పతి బాల్య దోషం మూడు రోజులు ఉంటుంది. అందుకే మే 2 నుంచి అన్ని శుభ కార్యాలు ప్రారంభం కానున్నాయి.