దిష్టి తగలకుండా నల్లదారం కట్టుకునేవారు ఈ నియమాలు ఏమి తప్పక పాటించాలి..?

మన హిందూ సంప్రదాయాలకు చాలా ప్రత్యేకత ఉంది. అలాగే వాస్తు నియమాలకు కూడా మన సాంప్రదాయంలో ప్రత్యేకత ఎక్కువ. హిందూ ప్రజలు సాంప్రదాయాల ప్రకారం ప్రతి నియమాలను పాటిస్తూ వాటి మీద నమ్మకం పెంచుకుంటారు. అయితే సాధారణంగా చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా నల్లటి కాటుక బొట్టు పెట్టడమే కాకుండా నల్లదారం కూడా కడుతూ ఉంటారు. ఇలా కాటుక బొట్టు పెట్టి కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందని ప్రజల నమ్మకం. సాధారణంగా చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కాబట్టి అందరూ వారి వైపు చూస్తూ ఉంటారు. అలా పిల్లలకు వారి దిష్టి తగలటం వల్ల పిల్లలు నిత్యం ఏడుస్తూ ఉంటారు.

అందువల్ల చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా నల్ల దారం కడతారు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్లు కూడా కాలికి నల్ల దారం కట్టుకుంటారు. కొందరు ఫ్యాషన్ కోసం ఇలా నల్లదారం కట్టుకుంటే మరికొందరు దిష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టుకుంటారు. అయితే ఇలా దిష్టి తగలకుండా కాలికి దారం పట్టుకుని సమయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. నియమాలను పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు నల్ల దారం కట్టుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాళ్ళకి నల్ల దారం కట్టుకునే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దిష్టి తగలకుండా కాలికి నల్ల దారం కట్టుకునే వారు అమావాస్య రోజు మాత్రమే అలా దిష్టి దారాన్ని కాలికి కట్టుకోవాలి. అమావాస్య రోజు కాకుండా మిగిలిన రోజులలో ఈ దారాన్ని కట్టుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే దిష్టి దారం కట్టుకున్న తర్వాత దానిని ఎక్కువకాలం అలాగే ఉంచుకోరాదు. ఎక్కువ రోజులపాటు ఆధారాన్ని మార్చుకోకుండా అలాగే ఉంచుకోవడం వల్ల కూడా అది దిష్టి తగలకుండా అడ్డుకోలేదు. అందువల్ల నెలకొకసారి ఆ దారాన్ని మారుస్తూ ఉండాలి. కేవలం అమావాస్య రోజు మాత్రమే ముందు కట్టుకున్న దారాన్ని విప్పి కొత్త దారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఫలితం ఉంటుంది.