మహాలయ పక్షాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2 నుంచి అమావాస్య వరకు అంటే సెప్టెంబర్ 17 వరకు. అయితే ఈ సమయంలో ఎవరెవరికి తర్పణాలు వదలాలి. పక్షాలు పెట్టాలి తెలుసుకుందాం…
సాధారణంగా పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత/తల్లి, నానమ్మ, తాతమ్మ) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు.
ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ …. పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.