మహాలయ అమావాస్య నాడు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేనివారు తప్పనిసరిగా పక్షం లేదా తర్పణం లేదా దానం,ధర్మం చేయడం తప్పనిసరిగా చేయాలి. పితృదేవతల అనుగ్రహం కోసం పితృకర్మలను చేయడం వల్ల వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. అక్షయ పుణ్యఫలం లభించాలనే కొడుకులు/కూతురులు చేసే శ్రాద్ధకర్మల వల్ల చనిపోయిన పెద్దలకు పుణ్యలోకాలు, సత్గతులు లభిస్తాయని పురాణాలు, పండితులు పేర్కొంటున్నారు.
ఏది చేయలేని వారు శక్తి లేనివారు కనీసం పెద్దల పేరుమీద పండితులకు, పేదవారికి ఏదో ఒక రకమైన దానం, ధర్మం చేయడం ఉత్తమం అని పూర్వీకులు భావించేవారు. అదే నేటికి ఆచారంగా కొనసాగుతుంది.
పెద్దల పేరుమీద బ్రాహ్మణులకు సాహిత్యం అంటే భోజన బియ్యం, పప్పు, ఉప్పు, కాయకూరలు ఇవ్వాలి. అదేవిధంగా పేదలకు, అవసరమైన వారికి ఆహారపదార్థాలు లేదా భోజనం పెట్టడం చేయాలి. ఇలా చేయడం వల్ల పెద్దల అనుగ్రహం లభిస్తుంది.