– దీపావళి.. దీపం, ఆవళి అంటే వరుస. ఈ దీపావళి అనేక విశేషాల సముదాయం.. ఈరోజు ఏ రాశివారు ఎలాంటి దీపం పెట్టాలి అనేదానిపై జ్యోతిష్యులు సూచించిన పరిహారాలు ఏ రాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలి అనే విషయాలన్నీ పురాణాల్లో ఉన్న విశేషాలు…
– మేష రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి వారు మూడువత్తులు వెలిగించాలి. వృషభ, కన్య, కుంభ రాశి వాళ్లు నాలుగు వత్తులు వెలిగించాలి. సింహ, వృశ్చిక, మీన రాశి వాళ్లు అయిదు వత్తులు వెలిగించాలి. తుల రాశి వాళ్లు ఆరువత్తులు వెలిగించాలి. మిథున, మకర రాశి వాళ్లు ఏడు వత్తులు వెలిగించాలని పండితులు పేర్కొంటున్నారు. ఇక ఆలస్యమెందుకు ఈ దీపావళి నాడు మీరు భక్తి శ్రద్ధలతో మీ రాశినిబట్టి పైన చెప్పిన వత్తుల సంఖ్యతో వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.
– – శివశ్రీ