కలలు.. మానవుడికి సహజంగా వస్తాయి. అయితే ఆయా కలలు కొన్నింటికి సంకేతంగా పూర్వీకులు భావించేవారు. అటువంటి వాటిలో సముద్రం కన్పిస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం.. సాధారణంగా మానవుల మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయి. అలాంటి కలలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట. మనసు సాధారణమైన స్థితిలో వున్నప్పుడు … తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని పండితుల అభిప్రాయం. ఇక కలలో ఒక్కోసారి సముద్రం కూడా కన్పిస్తుంది. సహజంగా సముద్రాన్ని చూస్తేనే కొంతమందికి మనసంతా అలజడిగా అనిపిస్తుంది. ఆ హోరు … కెరటాలు పోటీపడుతున్నట్టుగా దూసుకుంటూ రావడం ఒకరకమైన భయాన్ని కలిగిస్తుంది. కొందరికి ఆహ్లాదంగా ఉంటుంది. అందువలన కలలో సముద్రం కనిపించినా ఆందోళన కలుగుతుంది.
ఆందోళన కలిగించే కలలు, ఆ తరువాత నిద్రపట్టనివ్వవు గనుక వచ్చిన కల తెల్లవారిన తరువాత కూడా గుర్తుంటుంది. కొంతమంది పెద్దగా పట్టించుకోరుగానీ, మరికొంతమంది ఇలాంటి కలల గురించి సన్నిహితులతో చెప్పుకుంటూ వుంటారు. ఇక కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని చెప్పబడుతోంది.
ఇలాంటి కలలు వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. భగవంతుడి అనుగ్రహంతో బయటపడలేని కష్టం ఈ విశ్వంలోనే లేదనుకుంటే మనసు మరింత తేలిక పడుతుంది. ఇలా ఆయా పదార్థాలు, స్థలాలు, జంతువులు కన్పిస్తే ఆయా ఫలితాలు కలుగుతాయి.