సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోను ఏదో ఒక సమయంలో శని దేవుడు తన ప్రభావం చూపిస్తాడు. మనిషి జాతకం ప్రకారం వారు చేసే మంచి, చెడు పనులు ప్రభావం వల్ల శని దేవుడు దృష్టి మన మీద పడి కొందరికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తే మరి కొందరికి మాత్రం సకల కష్టాలు ప్రసాదిస్తాడు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం పిల్లలపై శని దేవుడి ప్రభావం ఉండదు. అసలు పిల్లలపై శని దేవుడి దృష్టి పడకుండా ఉండటానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలపై క్షణ దేవుడి ప్రభావం ఉండదు అని చెప్పటానికి ఉదాహరణగ పురాణాలలో ఒక కథ కూడా ఉంది. కౌశిక మహర్షి కి పిప్పలాదుడు అనే కుమారుడు ఉండేవాడు. అయితే కౌశిక మహర్షి తన కుమారుడిని పోషించలేక ఒకరోజు తన కుమారుడిని అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు. తల్లి తండ్రులకు దూరమైన అడవిలో ఒంటరిగా మిగిలిపోయిన పిప్పలాదుడు ఒక రావి చెట్టు నీడలో తలదాచుకుంటాడు. దాంతో ఆ చిన్నారికి పిప్పలాదుడు అనే పేరు కూడా వచ్చింది. అడవి పాలైన పిప్పలాదుడుని చూసి జాలి పడిన నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తూ ఆ నామమే నీ జీవితానికి వెలుగు చూపిస్తుంది అని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక ఆ సమయం నుండి పిప్పలాదుడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ ఒక మహర్షిగా మారిపోతాడు. ఇలా పిప్పిలాదుడు ని చూసి అతనిని అభినందించేందుకు వచ్చిన నారదుడిని పిప్పిలాదుడు ఇలా ప్రశ్నించాడు. బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణం ఏంటి అని ? అప్పుడు నారదుడు సమధానం చెబుతూ..శనిప్రభావం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతాడు. వెంటనే పిప్పిలాదుడు తన తపోబలంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగి బాల్యంలో ఎవ్వరినీ వేధించవద్దని హెచ్చరించాడు. అప్పుడు దేవతలు అందరు అక్కడకు వచ్చి పిప్పలాదుడికి నచ్చజెప్పడంతో శాంతించిన పిప్పలాదుడు తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. ఇక ఆ సమయం నుండి శని ప్రభావం పిల్లలపై ఉండదని పురాణాలు చెబుతున్నాయి.