సాధారణంగా మనం వాడే పదాలలో అనేక అర్థాలు తెలిసోతెలియకో వాడుతుంటాం… దీనిలో కానీ నిజానికి ఆ కష్టాలేంటో మనకు తెలిదు… మనిషి తన జీవితం లో ఎదుర్కొనే కష్టాలు చాలా ఉన్నప్పటికీ స్థూలంగా ఆ కష్టాలను ఎనిమిది రకాలుగా విభజించారు. కష్ట సాధ్యమైన ఈ కష్టాలనే అష్ట కష్టాలు
రుణం చయాచ్నా వృద్ధత్వం జారచోర దరిద్రతా!
రోగశ్చ భుక్త శేషశ్చా ప్యష్టకష్టాః ప్రకీర్తితాః! !.
అప్పులపాలవ్వడం, అడుక్కోవడం, ముసలితనం, వ్యభచారిగా మారడం, దొంగ అవడం, దారిద్ర్యం, ఎంగిలి భోజనం తినాల్సిరావడం. అనే ఎనిమిది వైపరీత్యాలు అష్టకష్టాలు. ఈ అష్టకష్టాలలో ఒక్కో కష్టం ఎదుర్కోవాలంటే ఎంతో గుండెనిబ్బరం, ధైర్యం కావాలి.
ఈ కష్టాల నుంచి బయటపడటానికి భగవంతుడి ఆరాధన, నిరంతర భగవన్నామస్మరణ చేస్తూ ధర్మం, సత్యంతో జీవిస్తే కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు