కార్తీక మాసంలో ఏ రోజు ఏం దానం చేయాలి?

కార్తీకంలో ప్రతి రోజు పవిత్రమైనదే. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో మాత్రం అది కొద్దిమందికే తెలుస్తుంది. ఏం చేయాలి, దేన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం… మొదటి పదిహేను రోజుల గురించి తెలుసుకుందాం…


– మొదటి రోజు : నెయ్యి, బంగారం.
– రెండవ రోజు : కలువపూలు, నూనె, ఉప్పు.
– మూడో రోజు : తదియ రోజున పార్వతీదేవిని పూజించాలి. ఉప్పు దానం చేయడం శుభప్రదం. ఫలితంగా శక్తి, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.
– నాలుగో రోజు : కార్తీకశుద్ధ చవితి. నాగులచవితిని పురస్కరించుకుని వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయాలి. నూనె, పెసరపప్పు, దానం ఇవ్వాలి. సద్భుద్ది, కార్యసిద్ధి సాధ్యమవుతుంది.
– ఐదో రోజు : ఈ రోజును జ్ఞానపంచమి అంటారు. ఆదిశేషుని పూజించాలి. ఫలితంగా కీర్తి లభిస్తుంది.
– ఆరో రోజు : షష్టి రోజున బ్రహ్మచారికి ఎర్ర గళ్ళకండువా దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు.
– ఏడో రోజు : సప్తమి రోజున దుర్గాదేవిని పూజించాలి. ఎర్రని వస్త్రంలో గోధుమలు దానం చేయాలి. దీంతో ఆయుష్సు వృద్ధి చెందుతుంది.
– ఎనిమిదో రోజు : అష్టమినాడు గోపూజ చేస్తే విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది.
– తొమ్మిదో రోజు : నవమినాటి నుంచి మూడు రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఫలితంగా ఆత్మరక్షణ, సంతాన రక్షణ ఉంటుంది.
– పదో రోజు : విష్ణువుని పూజించాలి. స్వయంపాకం, నూనె దానాలు ఆచరించాలి. దీంతో కీర్తి, ధన లాభం కలుగుతుంది.
– 11వ రోజు : ఈ ఏకాదశికే బోదనైకాదశి అని పేరు ఉంది. ఈ రోజు శివుడు, విష్ణువుని పూజిస్తే ధనప్రాప్తి, పదవీ యోగం కలుగుతుంది.
– 12వ రోజు : దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఉసిరి, తులసి మొక్కల వద్ద దామోదరుడిని ఉంచి పూజించి దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగుతాయి.
– 13వ రోజు : పువ్వులు దానం చేయాలి. వనభోజనాలు పెట్టుకోవడం మంచిది. మన్మథుడిని పూజించడంతో వీర్యవృద్ధి, సంతానవృద్ధి, సౌందర్యవృద్ధి కలుగుతుంది.
– 14వ రోజు : పాషాణ చతుర్దశి వ్రతం చేస్తారు. దున్నపోతు, లేకుంటే గేదెను దానం చేస్తారు. యముడిని పూజించడంతో అకాల మృత్యువులు తొలగుతాయి.
– 15వ రోజు : కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానమాచరించి శివాలయాల వద్ద జ్వాలాతోరణం వెలిగించాలి. సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. చంద్రుడిని పూజించడంతో మనశ్శాంతి కలుగుతుంది.