మన దేశంలో పసుపు విరివిగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంటి వంట గది నుండి పూజ గది వరకు పసుపు తప్పకుండా ఉపయోగిస్తారు. ఈ పసుపుని చాలా పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ప్రతి శుభకార్యంలోనూ పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం పసుపులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పసుపు ఆరోగ్యానికి కాకుండా అదృష్టాన్ని ప్రభావితం చేయటంలోనూ ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పసుపు బృహస్పతి అను గ్రహానికి చెందినది. అందువల్ల దీని ప్రభావం వ్యక్తులపై ఎక్కువగా ఉంటుందని.. పసుపుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మనం పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు. పసుపు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొందరు వ్యక్తుల వివాహానికి అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ఆటంకాలు తొలగిపోవడానికి ఎన్ని పూజలు పరిహారాలు చేసినా కూడా ఫలితం లేకపోతే ప్రతి బుధవారం రోజున పసుపుతో గణపతిని తయారుచేసి పూజించాలి. అలాగే పూజ సమయంలో గణపతికి పసుపుని సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉన్న విజ్ఞాలు తొలగిపోయి వివాహానికి ఉన్న ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. అలాగే పూజలో గణపతికి సమర్పించిన పసుపుని నుదుటిన తిలకంగా దిద్దుకోవటం వల్ల కూడా అనేక సమస్యలు తొలగిపోతాయి.
అయితే వ్యక్తుల జాతకం ప్రకారం కొందరి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటాడు. బృహస్పతి బలహీనంగా ఉండటం వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయడం వల్ల బృహస్పతి ప్రభావం తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయి. ఎదురవుతున్నాయో దీని కారణంగా ఆనందం అదృష్టం తగ్గుతున్నాయని భావిస్తే ప్రతిరోజు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. అలాగే తరచూ ఇంట్లో సమస్యలు ఎదురైనా కూడా గురువారం రోజున ఇంటి ప్రతి మూలలో పసుపు కలిపిన గంగా జలాన్ని చల్లటం వల్ల శుభం జరుగుతుంది.ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని కూడా చెబుతున్నారు.