సాధారణంగా ప్రతి ఇంట్లో వంట చేయటానికి పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటలలో పసుపు వేయడం వల్ల ఆ వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపు ఒక యాంటీబయటిక్ గా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉండగా పసుపు అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా ఆర్థిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి పసుపుతో నివారణ చర్యలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక మనిషి జాతకం జాతకంలోని గ్రహ దోషాల ఆధారంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యల నుండి విముక్తి పొందటానికి పసుపుతో కొన్ని రకాల పరిహారాలు పాటించాలి. పసుపు, విష్ణువు బృహస్పతి గ్రహాలకు సంబంధించినవిగా భావిస్తారు. విష్ణువు గృహస్తి బాగుంటే ఉంటే ఆ వ్యక్తి కూడా శుభ ఫలితాలు పొందుతాడు. అందువల్ల గురువారం రోజున ఇంటి ప్రహరీ గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
అలాగే జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న వారు గురువారం నాడు విష్ణువు, బృహస్పతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ అనంతరం, మణికట్టు, మెడపై పసుపుతో చిన్న గీత గీయలి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం బలపడుతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయడం వల్ల ఆ నీరు పూర్తిగా శుద్ధమవుతాయి. ఇలా చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరం అవుతాయి.