సీనియర్ సిటిజనులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్రీవారి దర్శనం!

తిరుమల వెళ్లాలంటే ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని చెప్పాలి. స్వామివారి దర్శనం చేసుకోవాలంటే గంటలకొద్దీ క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇలా దర్శనం చేసుకోవడం వల్ల సీనియర్ సిటిజన్ లు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీనియర్ సిటిజనులకు స్వామివారి దర్శనంలో ఎన్నో వెసులుబాటులు కల్పించారు.

ఇకపై తిరుమల వెళ్లే సీనియర్ సిటిజెన్లు ఎంతో ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజనులకు రెండు స్లాట్లు పరిష్కరించబడ్డాయి. ఉదయం 10 గంటలకు ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే సీనియర్ సిటిజెన్లు S1 కౌంటర్ లో మీ ఫోటోతో పాటు మీ వయసును తెలియజేసే ఐడి సమర్పించాలి. ఇక ఈ విధంగా స్వామి వారి దర్శనం చేసుకునే వారికి ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన పని లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.

భక్తులు వేచి ఉన్న సమయంలో వారికి సాంబార్ అన్నంతో పాటు పెరుగన్నం మరియు పాలు ఉచితంగా అందించబడతాయి. మీరు 20 రూపాయలు చెల్లిస్తే మీకు స్వామివారి ప్రసాదంగా రెండు లడ్డూలు లభిస్తాయి అంతకన్నా ఎక్కువ కావాలంటే ఒక్కో లడ్డుకు 25 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లో దర్శనం చేసుకుంటున్న సమయంలో ఇతర క్యూ లైన్లు పూర్తిగా నిలిపివేస్తారు. స్వామివారి దర్శనానికి వెళ్ళిన వారు 30 నిమిషాలలో స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు. కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి ప్రతి కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇతర సమాచారం కోసం హెల్ప్‌డెస్క్ తిరుమల 08772277777 ని సంప్రదించండి