సాధారణంగా కొందరు మహిళలు వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికే గర్భం దాల్చుతారు. మరికొంతమంది కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా సంతానం లేక బాధపడుతూ ఉంటారు. అయితే డాక్టర్లను సంప్రదించినా, భార్యాభర్తలలో ఎటువంటి లోపం లేకపోయినా సంతానం కలగదు. అయితే ఇలా భార్యాభర్తలలో ఎటువంటి లోపం లేకపోయినా కూడా సంతానం కలగకపోవడానికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. మన హిందూ శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా వాస్తు శాస్త్రం పట్ల ప్రజలు చాలా నమ్మకంగా ఉంటున్నారు.
అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం కార్యాలయాలను, దుకాణాలను, ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అయితే ఇలా వాస్తు ప్రకారం వాటిని నిర్మించడమే కాకుండా ఇంట్లో ప్రతి గది కూడా వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో అమర్చే ప్రతి వస్తువు కూడా వాస్తు ప్రకారం మార్చుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించకపోయినా ఇంట్లో వస్తువులు లేకపోయినా చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలా వాస్తు దోషం కారణంగా చాలామంది దంపతులు సంతానం లేక బాధపడుతూ ఉంటారు.
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పడకగది అందులోని కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఉంచడం వల్ల సంతాన లేని సమస్య దూరమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం నవ దంపతులు
పడకగదిలో ఆగ్నేయ భాగంలో పడుకోవడం మంచిది. ఎందుకంటే అది అగ్ని మూలతో అనుసంధానించబడి ఉంటుంది. ఇది మంచి శృంగార జీవితాన్ని కలిగి ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇలా చేయటం వల్ల సంతానం కలిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే మీ తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి. తల పడమర వైపు పాదాలు తూర్పు వైపు ఉండేలా చూసుకోవడం మంచిది. దంపతులు ఇలా వాస్తు నియమాలను పాటించడం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.