సాధారణంగా అందరూ ఏదో ఒక వృత్తి చేస్తుంటారు. వృత్తి అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడం. ఆయా రంగాలలో తమ జీవితాలను జీతాల కోసం పనిచేస్తుంటారు. అయితే చాలామంది ఏండ్ల తరబడి ఉద్యోగంలో వృద్ధి ఉండదు. వారిముందే వచ్చిన చిన్నవారు వారిని దాటిపోతుంటారు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ అదేనండి పదోన్నతి పొందాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం..
ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం కోసం అభద్రతా భావం తొలగించు కోవాలంటే తప్పకుండా శనీశ్వరుడిని “ఓం చర స్థిర స్వభవాయ నమః” అనే మంత్రంతో పూజించాలి. ఈ మంత్రాన్ని వీలయినన్ని సార్లు శనివారం రోజున జపిస్తూ ఉండాలి. సంధ్యా సమయంలో రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె. సింధూరం కలిపి పటానికి కానీ విగ్రహానికి కానీ లేపనం వేయాలి.
రెండో పరిహారం: కాలభైరవ ఆలయంలో దీపం వెలిగిస్తే స్థిరత్వం వస్తుంది. ఇక శివాలయం అయితే ఆవనూనెతో దీపాన్ని పెట్టండి.
ఇంట్లో శనివారం రోజు ఒక ఇనుప ప్రమిదలో కొబ్బరినూనెతో దీపం వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితం ఉంటుంది. శనివారం రోజున పచ్చకర్పూరం కుంకుమ కలిపి ముఖానికి ధరించాలి. అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం ద్వారా ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. సోమవారం రోజున పరమేశ్వరుడి పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామిని పూజించిన తరువాత శనగలు పెట్టి ప్రసాదంగా పరమేశ్వరుడికి నివేదించాలి. పరమేశ్వరుడి అనుగ్రహం వలన ఉద్యోగంలో సరైన స్థితికి రావడం జరుగుతుంది. అలాగే “ఓం వృషభ వాహనాయ నమః” మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపించాలి. ఇలా భక్తి, శ్రద్ధలతో ఆయా దేవతలను పూజిస్తే తప్పక అనతికాలంలో పదోన్నతి వస్తుంది. దీంతోపాటు వుద్యోగంలో కూడా భక్తితో, శ్రద్ధతో పనిచేయాలనేది మరిచిపోకండి.