లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఇంట్లో చేయవలసిన పనులు.. చేయకూడని పనులు ఇవే..?

ప్రస్తుత కాలంలో ఈ సృష్టిలో జన్మించిన ప్రతి మానవుని జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఉదితే గాలికి పోయే రంగు నోట్లు ఒక వ్యక్తి జీవితాన్ని శాసిస్తున్నాయి. అంతలా ప్రపంచం డబ్బుకు దాసోహం అయిపోయింది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది కష్టపడి పనిచేసే డబ్బు సంపాదిస్తే మరి కొంతమంది మాత్రం అక్రమాలు అరాచకాలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం సంపదకు ప్రతీకగా ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి వివిధ రకాల పూజలు, పరిహారాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చేయకూడని పనులు :
• సాధారణంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తూ ఉంటారు. ఇటువంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు. అందువల్ల పొరపాటున కూడా సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు.
• సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. అందువల్ల ఆ సమయంలో పొరపాటున కూడా ఇల్లు ఊడ్వరాదు. సంధ్య సమయం తర్వాత ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
• అలాగే చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు వరకు ఆ ఇంట్లో అలాగే ఉంచుతారు. ఇలా ఉంచిన ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు.
• ఇంటికి ఉత్తర దిశలో చెత్త కుండి పెట్టటం వల్ల కూడా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉండదు.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి చేయవలసిన పనులు

• మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ యంత్రాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
• అలాగే పరిశుభ్రంగా అందంగా అలంకరించబడిన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది. అందువల్ల ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
• అంతేకాకుండా తులసి, ఉసిరి చెట్ల వద్ద ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు.