బ్లూమూన్ ప్రత్యేకతలు ఇవే !

శరత్కాలం.. అంటేనే ప్రత్యేకమైన వెన్నల అందాలకు ప్రతీక. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణానికి ఈ శరత్కాలం పేరుగాంచింది. అయితే అక్టోబర్ 31న పౌర్ణమి. ఈరోజు బ్లూమూన్ డే. ఆ విశేషాలు తెలుసుకుందాం…
విజ్ఞాన శాస్త్రం ప్రకారం బ్లూ మూన్ అనేది ఓ ఖగోళ దృగ్విషయం. ప్రతి 2 నుంచి 3 ఏళ్లకు ఓ సారి కనిపిస్తుంది. ఈ రోజు బ్లూ మూనే డే. తిరిగి ఇలాంటి దృశ్యం 2029లో మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది బ్లూ మూన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని పండితులు ఇటు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నాసా తీసిన మునుపటి చిత్రాల ప్రకారం చంద్రుడు పసుపు లేదా తెలుపు రంగులో కనిపిస్తాడు. కానీ ఈ సారి మాత్రం చంద్రుడు స్వరూపం తేలికపాటి రంగులో ఆకాశం రంగులో కలిసినట్లు సంకేతాలు ఉన్నాయి.

These are the specialties of Bluemoon
These are the specialties of Bluemoon

నెలలో రెండు పున్నాలు…

సనాతన ధర్మ జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచాంగంలో పౌర్ణమి, అమవాస్య రెండూ ఒకే నెలలో అంటే ఒకే మాసంలో వస్తాయి. ఇదే సమయంలో ఏడాదిలో 2, 3 సంవత్సరాల్లో కొన్నిసార్లు నెలలో రెండు పౌర్ణమిలు ఉంటాయి. అంతేకాకుండా 2020 అక్టోబరులో కూడా ఇదే జరిగింది. ఈ నెల మొదటి తేదీన ఓ పౌర్ణమి వచ్చింది. అంతేకాకుండా అక్టోబరు 31న రెండో పౌర్ణమి వచ్చింది. ఈ విధంగా వచ్చినపుడు రెండో పౌర్ణమిలో బ్లూ మూన్ అని పిలుస్తుంటారు.
శరత్కాల పౌర్ణమి అక్టోబరు 31న. శరత్కాల చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడని భావిస్తారు. దీనికి కారణం చంద్రుడు పెద్దగా కన్పించడమే.
ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రివరకు వీలును బట్టి చంద్ర ఆరాధన, శ్రీలక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ధనం, సంపదలు వృద్ధి చెందుతాయి. అంతేకాదు మనసుకు సంబంధించిన సమస్యలు, రోగాలు పోతాయి.