నరదిష్టి గురించి తెలుసా.. నరదిష్టి పోవాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

మనలో చాలామంది ఏ ఆరోగ్య సమస్య లేకపోయినా నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నరదిష్టి చాలా ప్రమాదకరం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకు నరదిష్టి తగిలిందని భావిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ప్రతిరోజూ తులసి మొక్కకు పూజ చేయడం ద్వారా నరదిష్టికి చెక్ పెట్టవచ్చు. రోజూ తులసి పూజ చేయడం ద్వారా దిష్టి తగలకుండా ఉంటుంది.

ఇంటిముందు వినాయకుని ఫోటోలు పెట్టుకోవడం, గుమ్మడికాయని వేలాడదీయడం, రాక్షస రూపాలని పెట్టుకోవడం ద్వారా కూడా నరదిష్టి తొలగిపోయే అవకాశం ఉంటుంది. నరసింహస్వామిని పూజించడం ద్వారా, నల్ల దారం మెడలో కట్టుకోవడం ద్వారా నరదిష్టి తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. పురుషులు మొలతాడు కట్టుకోవడం ద్వారా నరదిష్టి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం అయితే ఉంటుంది.

ప్రతిరోజూ దీపారాధన చేయడం ద్వారా కూడా నరదిష్టి నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే ఉంటయి. కుల దైవాన్ని భక్తితో పూజించడం ద్వారా కూడా నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు. బొట్టు లేదా కుంకుమ పెట్టుకోవడం ద్వారా నరదిష్టి తొలగిపోతుంది. ఆర్థికంగా ఎదుగుతున్న మనుషులకు ప్రధానంగా నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే పండితులను సంప్రదించాలి.

నరదిష్టి చాలా ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. నరదిష్టి వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నరదిష్టి వల్ల ఎంతో ఎదిగిన వాళ్లు సైతం నిత్య జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.