శివారాధన అనేది సర్వసాధరణం. అయితే దీనిలో ఆయా లింగాలను పూజిస్తే ఆయా ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం పాదరసలింగ అభిషేక విశేషాలు తెలుసుకుందాం…
పూర్వం నుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో ఈ పాదరసంతో తయారుచేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మిం చుకుని ఎంతో ఆధ్మాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మీ, దుర్గ మొదలైన దేవతామూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. మంచి సమృద్ధితోపాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి.
మానవ జీవితంలో భౌతికంగా వున్న లోట్లను తీరుస్తూ, ఆధ్మాత్మికంగా అతనిలో ఉన్నతిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. మొత్తానికి పాదరసం పూర్నత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు. కేవలం ఆధ్మాత్మికంగానే కాదు… ఆయు ర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్థనానికి దీనిని ఉపయో గిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు. పాదరస శివలింగాన్ని నిత్యం పూజిస్తే.. అన్నిరకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన శాస్త్రాలు తెలుపుతున్నాయి.