దేవుడు దగ్గర నిమ్మకాయ దీపం పెడితే ఫలితాలు ఇవే !

దేవుడు.. దీపారాధన అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన విషయం. అయితే ఈ దీపాలు అనేక రకాలుగా పెడుతుంటారు. వీటిలో నిమ్మకాయలతో పెట్టే దీపం ఒకటి. దాని గురించి తెలుసుకుందాం..
నిమ్మకాయదీపం అనేది కుజదోషం, కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది. నిమ్మకాయ శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం . నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి …గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ ,మారెమ్మ,పెద్దమ్మ, మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు. గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి.

పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా పరిగిణించే మంగళ, శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి ,లోబాన్ ,సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి. పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం పెడితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.