తెలుగు సంవత్సరాల పేర్లు ఇవే !

తెలుగు సంవత్సరాది రాగానే అందరం ఆ సంవత్సరం పేరు తెలుసుకుంటాం. ఉగాది నుంచి మళ్లీ ఉగాది వరకు ఆ సంవత్సరం పేరును ప్రతీ రోజు దేవుడి పూజ సందర్భంలో సంకల్పంలో చెప్తుంటారు. అయితే అసలు ఆ అరవై ఏండ్లు వాటి పేర్లు తెలుసుకుందాం…

 these are the names-of-telugu-years
these are the names-of-telugu-years

1.ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ. ఇవీ తెలుగు సంవత్సరాల పేర్లు.
మన పిల్లలకు నేర్పి వాటి విశిష్టతలను తెలపండి.