కార్తీక మాసంలో నీటిలో దీపాలు వెలిగించడం వల్ల కలిగి శుభ ఫలితాలు ఇవే..?

హిందూ పురాణాల ప్రకారం అన్ని మాసాలలోకి కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాసంలో సూర్యోదయానికి గంట సమయం ఉంది స్నానం ఆచరించి ఆ పరమశివుడిని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. నమశ్శివాయ అనే పంచ బీజాక్షరాల నుండి ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి అనే పంచ భూతాలు.. ఆ పంచ భూతాలు నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీకమాసంలో దేవాలయాలను దర్శించి అక్కడ నీటిలో దీపాలను వెలిగిస్తారు.

మనలో ఉండే ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. నీటిలో దీపాన్ని వెలిగించడం అంటే జ్యోతి స్వరూపమైన మన ఆత్మను పంచభూతాలలో ఒకటైన నీటిలో వదలటం అని అర్థం. ఇలా కార్తీక మాసంలో నీటిలో దీపాలు వెలిగించి వదలటం వల్ల మన ఆత్మను పంచభూతాత్మకం అయిన ఆ పరమ శివుడికి అంకితం చేయటం. అందువల్ల కార్తీకమాసంలో దేవాలయాలను దర్శించి బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం ఆచరించి ఆ పరమశివుని ఆరాధిస్తూ నది జలంలో దీపాలు వెలిగించడం వల్ల గత జన్మతో పాటు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోయి మరణించిన తర్వాత ఆ పరమశివుడి సన్నిధికి మన ఆత్మ చేరుతుందని విశ్వాసం.

పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీకమాసంలో బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులతో ఆ పరమశివుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అలాగే ఈ కార్తీకమాసంలో లక్ష్మీ సమేతుడైన ఆ మహావిష్ణువుని తులసి దళాలు, తామర పువ్వులు, గరిక, జాజి తో ఆరాధించటం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దేవాలయాలకు వెళ్లి దేవుడి ముందు దీపాలను వెలిగించి ఆరాధించడం వల్ల పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేయలేని వారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో చేసినా కూడా పుణ్యం లభిస్తుంది.