కార్తీక స్నానం విశిష్టత, శుభ ఫలితాలు పూర్తి వివరాలు మీకోసం..?

హిందూ పురాణాల ప్రకారం కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేసి ఆ పరమేశ్వరుని ఆరాధించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఈ కార్తీకమాసంలో చేసే స్నానానికి కూడా ఒక విశిష్టత ఉందని హిందూ పురాణాలు వెల్లడిస్తున్నాయి. దసరా పండుగ తర్వాత ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుంచి మొదలై కార్తీక మాసం పౌర్ణమి వరకు ఒక నెల రోజులపాటు సూర్యోదయానికి ఒక గంట ముందు చేసే స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. ఈ కార్తీకమాసంలో సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీస్నానానికి చాలా ప్రత్యేకత ఉంది.

కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ స్నానం ఆచరించలేని వారు ఆ పుణ్యక్షేత్రాలను అదీ జలాలను ఇంటికి తెప్పించుకొని ఇంట్లో స్నానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

నమః కమలనాభాయ నమస్తే జలశాయినే |
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||

కార్తీక మాసంలో ఈ మంత్రాన్ని జపిస్తూ ముందుగా అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత..

కార్తికేహం కరిష్యామి ప్రాతః సన్నం జనార్దన |
ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర మహాశయ ||
ధ్యాత్వాహం త్వాం చ దేవేశ జలేస్మిన్ స్నాతు ముద్యతః |
తవ ప్రసాదాత్ పాపం మే దామోదర విన్యస్యతు ||

అనే మంత్రాన్ని జపిస్తే కార్తీకమాసంలో స్నానం చేయాలి. ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ మంత్రాన్ని చూపిస్తూ స్నానం చేయడం వల్ల ఆ మహావిష్ణువు అనుగ్రహం పొంది సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయి.

ఆ తర్వాత ..

“వ్రతినః కార్తికే మాసి స్నాతస్య విధివత్ మమ |

గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితో హరే ||

మంత్రాన్ని జపిస్తూ తూర్పు దిశగా తిరిగి తులసి అమ్మవారికి నీరు సమర్పించాలి. ఇలా ఈ మంత్రం చదువుతూ తులసి మాతకు నీరు సమర్పించడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ కార్తీకమాసంలో శివుడితో పాటు ఆ మహావిష్ణువుని కూడా ఆరాధించడం సుఖ ఫలితాలను కలుగజేస్తాయి.

కార్తీక మాసంలో “ఓం నమో నారాయణాయ” అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ లక్ష్మీ సమేతుడైన ఆ విష్ణుమూర్తి కి నెయ్యితో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆరాధించడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలతో తొలగిపోయి సిరిసంపదలు సిద్ధిస్తాయి. సంతానలేని సమస్యతో బాధపడే వారు కూడా ఈ కార్తీకమాసంలో కార్తీక స్నానమాచరించి ఆ మహావిష్ణువును ఆరాధించటం వల్ల సంతాన సమస్యలు తొలగిపోతాయి.