హిందూ శాస్త్రం ప్రకారం దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజున ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ తర్వాత ఇంటిల్లిపాది టపాసులు పేలుస్తూ..ఎంతో ఉత్సాహంగా పండుగని జరుపుకుంటారు. అయితే దీపావళి పండగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశి రోజు నుండి దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. ధన త్రయోదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ధన త్రయోదశి రోజున ఏదైనా వస్తువులను కొనటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ధన త్రయోదశి రోజున దానధర్మాలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ధన త్రయోదశి రోజున ఏ వస్తువులను దానం చేయటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఈ ధన త్రయోదశి రోజున ధాన్యాన్ని దానం చేయడం శుభప్రదంగా పరిగణించవచ్చు. ఈ పవిత్రమైన రోజున పేదవారికి ధాన్యం దానం చేయటం వల్ల ఏడాది పాటు ఇంట్లో ధాన్యానికి కొదువ ఉండదు. అందువల్ల ధనత్రయోదశి రోజున తప్పకుండా ధాన్యం దానం చేయాలి.
• అలాగే ధనత్రయోదశి రోజున ఇనుము లేదా ఇనుముతో తయారు చేసిన వస్తువులను దానం చేయడం శుభప్రదం. ధన త్రయోదశి రోజున ఇనుము దానం చేయటం వల్ల జీవితంలో ఎదురైనా సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా దానం చేయడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది.
• సాధారణంగా ధన త్రయోదశి రోజున చీపురు కొనుగోలు చేయటం సాంప్రదాయంగా భావిస్తారు. శుభ్రతను ఎక్కువగా ఇష్టపడే లక్ష్మీదేవి ధన త్రయోదశి రోజున చీపురు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. అలాగే ధన త్రయోదశి రోజున చీపురు దానం చేయడం కూడా శుభప్రదం అని చెప్పవచ్చు. ముఖ్యంగా గుడిని శుభ్రంగా ఉంచే వారికి చీపురు దానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
• అలాగే ఈరోజున పేదవారికి దుస్తులు దానం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం పొంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది.