కార్తీక మాసంలో తులసి పూజ ప్రాధాన్యత.. విశిష్టత ఏమిటో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీకమాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు.ఈ నెలరోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీదేవితో పాటు శివకేశవులను ఆరాధించడం వల్ల అన్ని శుభపరిణామాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో లక్ష్మీదేవి స్వరూపిణి అయినటువంటి తులసి చెట్టును ఎంతో భక్తి భావంతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీకమాసంలో తులసికి ఎందుకు అంత ప్రాధాన్యత తులసి పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే…

శాస్త్రాల ప్రకారం తులసి దేవి కార్తీక మాసంలో అమావాస్య రోజున జన్మించిందని తెలుస్తోంది. అందుకే కార్తీక మాసం మొత్తం తులసి మొక్కను భక్తి భావంతో పూజిస్తూ ఉంటారు.ఇక ప్రతిరోజు కార్తీక మాసంలో తులసి మొక్కను ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.ఇక మన ఇంట్లో తులసి మొక్క కనుక లేకపోతే కార్తీక మాసం గురువారం రోజున తులసి మొక్కను నాటడం ఎంతో శుభప్రదం.

ఇలా కార్తీకమాసంలో ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీరు పోసి తులసి చుట్టూ ప్రదర్శనలు చేయాలి. అలాగే సాయంత్రం తులసి మొక్క కింద నెయ్యితో దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మహావిష్ణువు అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. ఇలా ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం శుభసూచకం అయితే ఆదివారం తులసి మొక్కకు నీరును పోసి ప్రదక్షణలు చేసిన దీపం వెలిగించకూడదు. అదేవిధంగా మనం తులసి మొక్కను నాటిన ప్రాంతంలో తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించడం అవసరం. ఇలా కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుంది.