మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఆచార వ్యవహారాలను ఎలా పాటిస్తామో వాస్తు చిట్కాలను కూడా అదేవిధంగా పాటిస్తాము. ఇలా మనం ఏ చిన్న పని చేసిన వాస్తు చూసి ఆ పనిని ప్రారంభిస్తారు. అయితే మన ఇంట్లో మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో అంత శుభం కలుగుతుందని చెప్పాలి. మరి అదృష్టాన్ని తెచ్చే వాస్తు చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…
వాస్తు శాస్త్రం ప్రకారం వారానికి ఒక్కసారి అయినా మన ఇంట్లో కర్పూర హారతి ఇవ్వడం ఎంతో మంచిది.ఇలా కర్పూరంతో ఇంట్లో హారతి ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.ఇలా కర్పూర హారతి ఇవ్వడంతో పాటు ఆవాల నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.
ఇకపోతే ప్రతి గురువారం మనం తులసి మొక్కకు నీటిని పోయడమే కాకుండా కాస్త పాలను కూడా వేసి పూజించాలి. ఇలా తులసి మొక్కకు పాలను సమర్పించడం వల్ల మన ఇంట్లో ఏర్పడే అవాంతరాలన్నీ తొలగిపోతాయి. ఇక ఒకే పడుక గదిలో ఎప్పుడూ కూడా రెండు మంచాలను ఉంచకూడదు.ఇది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను తగ్గించడమే కాకుండా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గురువు చిత్రపటాలను లివింగ్ రూమ్ లో ఉంచడం ఎంతో మంచిది. ఇలా చేయటం వల్ల వారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి.