కార్తీక మాసంలో చాలామందిభక్తులు అయ్యప్ప దీక్షను ధరిస్తూ ఉంటారు. కార్తీకమాసంలో మొదలైన ఈ దీక్ష కొంతమంది 21 రోజులపాటు ధరించి ఆ తర్వాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప దీక్ష తొలగిస్తారు. మరికొంతమంది ధనుర్మాసంలో అయ్యప్ప దీక్ష ధరించి ఆ తర్వాత సంక్రాంతి పండుగ రోజున అయ్యప్ప దర్శనం చేసుకుని ఆయప్ప దీక్ష నుండి విముక్తులవుతారు. ఇలా ప్రతి ఏటా ఎంతోమంది భక్తులు అయ్యప్ప దీక్ష ధరించి శబరిమల కొండలపై కొలువై ఉన్న అయ్యప్పను దర్శించి ఆ తర్వాత అయ్యప్ప మాల తొలగిస్తారు. ఇలా ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు అయ్యప్పని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు దాదాపు 50 వేలకు మంది పైగా భక్తులు అయ్యప్పని దర్శించుకుంటున్నారు. అయితే ఈ శబరిమల దర్శనంలో మకర జ్యోతి ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.
మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలపై మకర జ్యోతి వెలుగుతుందని దీనికి చాలా ప్రత్యేకత ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఈ జ్యోతిలో ఎటువంటి నిజం లేదని కొంతమంది భక్తులు పొట్టి పారేస్తూ ఉంటారు. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలపై కనిపించే ఆ మకర జ్యోతిని దర్శించడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజలందరూ మకర సంక్రాంతి రోజున కనిపించే ఆ జ్యోతిని వీక్షించటానికి శబరిమల చేరుకుంటూ ఉంటారు. అయితే మకర జ్యోతి వెనుక గల అసలు రహస్యాల గురించి.. దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం… పూర్వం శబరిమల కొండలలో నివసిస్తున్న గిరిజనులను కాపాడటానికి అయ్యప్ప మహిషాన్ని చంపి కొండలపై ఒక పెద్ద జ్యోతిని వెలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. రాత్రిపూట వెలిగించి ఈ జ్యోతిని చూసిన తర్వాత పందాల వంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు సమర్పించడానికి వస్తారని పండితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా శబరిమల కొండలలో నివసించే గిరిజనులు మకర సంక్రాంతి రోజున పెద్ద జ్యోతి వెలిగించి పండగ జరుపుకుంటారు. ఈ జ్యోతి వెలిగిన తర్వాత వంశస్థులు అయ్యప్ప స్వామికి ఆభరణాలు సమర్పిస్తారని దేవాలయ కమిటీ మరియు ధర్మాధికారులు వెల్లడించారు. పూర్వకాలం నుండి ఇక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి వెల్లడించాడు. దీన్నే అయ్యప్ప స్వామి జ్యోతిగా, మకర జ్యోతిగా పిలుస్తూ ఉంటారు.దీని వల్ల అప్పటినుంచి ఇప్పటివరకు జ్యోతి దర్శనం క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.