బిగ్ బాస్ 4: చెడ్డీలు వేసుకొని ర‌చ్చ చేస్తున్న హారిక‌.. ట్రోల్స్‌పై గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చిన‌ దేత్త‌డి త‌ల్లి, అన్న‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్‌ఫుల్‌గా మూడు సీజ‌న్స్ పూర్తి చేసుకొని నాలుగో సీజ‌న్ 4లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.సీజ‌న్ 4కు కూడా మ‌రికొద్ది రోజుల‌లో శుభం కార్డ్ ప‌డ‌నుంది. అయితే ఈ షోకు సంబంధించి రోజు ఎన్నో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. హౌజ్ మేట్స్ ఆట‌, వాళ్ళు వేసుకునే డ్రెస్‌, ప్ర‌వ‌ర్త‌న ఇలా ప్ర‌తి విష‌యంపై రోజు ఏదో ఒక చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. తాజాగా హారిక డ్రెస్ విష‌యంలో కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా, దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు హారిక సోద‌రుడు, త‌ల్లి.

బిగ్ బాస్ సీజ‌న్ 4 కొత్త‌లో అంద‌రు మోనాల్ త‌న గ్లామ‌ర్ షోతో క‌ట్టిప‌డేస్తుంద‌ని అనుకున్నారు. కాని ఆమెని మించి రెచ్చిపోతుంది. హారిక‌. చిన్న‌చిన్న చెడ్డీలు.. టైట్ టీ ష‌ర్ట్స్‌తో యూత్‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే హారిక డ్రెస్సింగ్ ఓ వ‌ర్గానికి అస‌హ్యం తెప్పిస్తుంది. ఈ నేప‌థ్యంలో వారికి కొంత క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు హారిక త‌ల్లి జ్యోతి, అన్న వంశీ. ఆడ‌పిల్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడే హక్కు ఎవ‌రికి లేదు. లంగాఓణీలు మ‌న సంప్ర‌దాయం కావ‌చ్చు, కాని ప‌రిస్థితులని బ‌ట్టి డ్రెస్‌లు వేసుకోవాలి. త‌న డ్రెస్ త‌న ఇష్టం. అలా అని బికీనీలు వేసుకోమ‌ని చెప్ప‌డం లేదంటూ జ్యోతి స్ప‌ష్టం చేశారు

ఇక హారిక అన్న వంశీ మాట్లాడుతూ.. విమ‌ర్శ‌లు చేసే వాళ్ల‌కి ఎప్పుడు అవ‌త‌లి వారిలో నెగెటివ్ యాంగిల్ క‌నిపిస్త‌ది. ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళ‌కి బిగ్ బాస్ ఆఫ‌ర్ వ‌స్తే, వాళ్లు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి అని చెప్పిన‌ప్పుడు మాత్రం ఆ ప్లేస్‌లో ఉండి ఆలోచించ‌రు. నేను మాత్రం ఆలోచిస్తాం. ఫేమ్ కోసం ఇలాంటి త‌ప్పుడు కామెంట్స్ క‌రెక్ట్ కాదు. కెరియర్‌లో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి. డ్రెస్ కోసం కెరియర్‌కి బ్రేక్ వేయాల‌ని అనుకోం. సంద‌ర్భాన్ని బ‌ట్టే హారిక డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు లంగాఓణీలు వేస్తుంది, డ్యాన్స్‌లు చేయాల‌న్న‌ప్పుడు అందుకు త‌గ్గ డ్రెస్ వేసుకుంటుంది. అయిన అమ్మాయిలు, అబ్బాయిలు సమానం అనుకున్నప్పుడు అబ్బాయిలు షార్ట్స్ వేసుకొని బ‌య‌ట తిరిగితే త‌ప్పులేదు, అమ్మాయిలు వేసుకుంటే త‌ప్ప‌. ఫారిన్‌లో ఇవ‌న్నీ కామ‌న్. మ‌న ద‌గ్గ‌రే బూత‌ద్ధంలో పెట్టి చూస్తారంటూ త‌న చెల్లి డ్రెస్సింగ్ గురించి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు వంశీ.